Page Loader
Anmol Bishnoi: లారెన్స్ బిష్ణోయ్‌ తమ్ముడు అన్మోల్ బిష్ణోయి అరెస్టు
లారెన్స్ బిష్ణోయ్‌ తమ్ముడు అన్మోల్ బిష్ణోయి అరెస్టు

Anmol Bishnoi: లారెన్స్ బిష్ణోయ్‌ తమ్ముడు అన్మోల్ బిష్ణోయి అరెస్టు

వ్రాసిన వారు Jayachandra Akuri
Nov 19, 2024
12:21 pm

ఈ వార్తాకథనం ఏంటి

బాలీవుడ్‌ స్టార్‌లు, రాజకీయ నాయకులను బెదిరించే గ్యాంగ్‌స్టర్ లారెన్స్ బిష్ణోయ్ సోదరుడు అన్మోల్ బిష్ణోయ్‌ తాజాగా కాలిఫోర్నియాలో అరెస్ట్‌ అయ్యాడు. అన్మోల్ బిష్ణోయ్‌ను అమెరికా పోలీసులు అరెస్ట్‌ చేశారు. బాలీవుడ్‌ నటుడు సల్మాన్‌ఖాన్‌ బంధు నివాసం వద్ద కాల్పులకు సంబంధించి అన్మోల్ బిష్ణోయి పాత్ర ఉన్నట్లు పోలీసులు తెలిపారు. అన్మోల్ బిష్ణోయ్‌పై పంజాబ్‌లోని సింగర్ సిద్దూ మూసే వాలా హత్యతో పాటు మరొక హత్యకి సంబంధించి ఆరోపణలు వచ్చాయి. ఈ నేపథ్యంలో జాతీయ దర్యాప్తు సంస్థ అతడిపై రూ. 10 లక్షల రివార్డ్‌ను ప్రకటించింది. అన్మోల్ బిష్ణోయ్ దొంగ పాస్‌పోర్ట్‌ ఉపయోగించి విదేశాలకు పారిపోయాడు. మొదట కెనడాకు వెళ్లిన అనంతరం, అగ్ర రాజ్యమైన అమెరికాలో తలదాచుకున్నాడు.

Details

అన్మోలే పై 18 కేసులు

మహారాష్ట్ర మాజీ మంత్రి బాబా సిద్ధిఖీ హత్యలోనూ అతడికి సంబంధాలు ఉన్నట్లు పోలీసులు గుర్తించారు. అన్మోల్ బిష్ణోయ్, లారెన్స్ బిష్ణోయి గ్యాంగ్‌‌లో కీలక పాత్ర పోషిస్తున్నాడు. సెలబ్రిటీలను బెదిరించడం, హత్యలు చేయడం, తదితర నేరాలలో వారికి నైపుణ్యం ఉంది. అన్మోల్ బిష్ణోయ్‌ను భారత్‌కు రప్పించేందుకు ముంబై పోలీసులు అన్ని విధాలా ప్రయత్నాలు చేస్తున్నారు. ఆయనను భారత్‌కు తీసుకురావడానికి ఇప్పటికే ప్రత్యేక కోర్టులో పిటిషన్ దాఖలు చేశారు. ఇటీవలే అన్మోల్ బిష్ణోయ్‌కు సంబంధించిన పలు కీలక ఆధారాలను పోలీసులు సేకరించారు. అన్మోలే బిష్నోయి, భాను అనే పేరుతో కూడా పిలుస్తారు. అన్మోలే పై మొత్తం 18 నేరాల కేసులు నమోదయ్యాయి. జోధ్‌పూర్ జైల్లో శిక్ష అనుభవించిన అనంతరం 2021లో బెయిల్‌పై అతను విడుదలయ్యారు.