Page Loader
Telangana: తెలంగాణ హైకోర్టులో విషాద ఘటన.. కేసు వాదిస్తు కుప్పకూలిన న్యాయవాది 
తెలంగాణ హైకోర్టులో విషాద ఘటన.. కేసు వాదిస్తు కుప్పకూలిన న్యాయవాది

Telangana: తెలంగాణ హైకోర్టులో విషాద ఘటన.. కేసు వాదిస్తు కుప్పకూలిన న్యాయవాది 

వ్రాసిన వారు Sirish Praharaju
Feb 18, 2025
04:17 pm

ఈ వార్తాకథనం ఏంటి

తెలంగాణ హైకోర్టులో విషాదకర ఘటన చోటుచేసుకుంది. కోర్టు హాలులో ఓ న్యాయవాది కుప్పకూలిన సంఘటన తోటి న్యాయవాదులను తీవ్ర ఆవేదనకు గురిచేసింది. వివరాల్లోకి వెళితే... న్యాయవాది వేణుగోపాలరావు 21వ కోర్టు హాలులో ఓ కేసుకు సంబంధించిన వాదనలు వినిపిస్తున్న సమయంలో అకస్మాత్తుగా కుప్పకూలారు. గమనించిన తోటి న్యాయవాదులు వెంటనే స్పందించి, ఆయనను అంబులెన్స్‌లో ఉస్మానియా ఆసుపత్రికి తరలించారు. అయితే అప్పటికే గుండెపోటు కారణంగా వేణుగోపాలరావు మృతి చెందినట్టు వైద్యులు ధ్రువీకరించారు. ఈ విషాద ఘటనతో 21వ కోర్టులో న్యాయమూర్తి సంతాప సూచకంగా పిటిషన్ల విచారణను నిలిపివేశారు. అలాగే, మిగతా కోర్టుల్లో అత్యవసర పిటిషన్లు, పాస్ ఓవర్‌ పిటిషన్లను మాత్రమే విచారించి, రెగ్యులర్‌ పిటిషన్లను వాయిదా వేశారు.

ట్విట్టర్ పోస్ట్ చేయండి

హైకోర్టులో వాదిస్తుండగా గుండెపోటుతో న్యాయవాది మృతి