LOADING...
BR Gavai: సీజేఐపైకి చెప్పు విసిరే యత్నం… న్యాయవాది రాకేష్ కిషోర్‌పై కఠిన చర్యలు
సీజేఐపైకి చెప్పు విసిరే యత్నం… న్యాయవాది రాకేష్ కిషోర్‌పై కఠిన చర్యలు

BR Gavai: సీజేఐపైకి చెప్పు విసిరే యత్నం… న్యాయవాది రాకేష్ కిషోర్‌పై కఠిన చర్యలు

వ్రాసిన వారు Sirish Praharaju
Oct 09, 2025
11:40 am

ఈ వార్తాకథనం ఏంటి

భారత ప్రధాన న్యాయమూర్తి (CJI) బీఆర్ గవాయ్ పైకి చెప్పు విసిరేందుకు యత్నించిన ఘటన తీవ్ర దుమారం రేపుతోంది ఈ అనూహ్య ఘటన న్యాయవ్యవస్థలో పెద్ద కలకలం సృష్టించింది. దీనికి ప్రతిస్పందనగా,సుప్రీంకోర్టు బార్ అసోసియేషన్ (SCBA) కఠినమైన నిర్ణయం తీసుకుంది. ప్రత్యేకంగా,న్యాయవాది రాకేష్ కిషోర్ తాత్కాలిక సభ్యత్వాన్ని వెంటనే రద్దు చేస్తుందని ప్రకటించింది. ఈ ఘటనను SCBA తీవ్రంగా పరిగణించింది. సభ్యుల జాబితా నుండి రాకేష్ కిషోర్ పేరును తొలగించడానికి తీర్మానం తీసుకుంది. ఈ నిర్ణయాన్ని"లైవ్ లా" నివేదించింది. ఇదిలా ఉండగా, బార్ కౌన్సిల్ ఆఫ్ ఇండియా (బీసీఐ) కూడా రాకేష్‌ను సస్పెండ్ చేస్తూ నిర్ణయం తీసుకుంది.

వివరాలు 

చర్యల అనుమతి కోసం అటార్నీ జనరల్‌కు లేఖ 

ఇదిలా ఉండగా, బార్ కౌన్సిల్ ఆఫ్ ఇండియా (బీసీఐ) కూడా రాకేష్‌ను సస్పెండ్ చేస్తూ నిర్ణయం తీసుకుంది. మరోవైపు ఆయనపై క్రిమినల్ కోర్టు ధిక్కారణ చర్యలు చేపట్టేందుకు కూడా రంగం సిద్ధమవుతోంది. అటార్నీ జనరల్‌కు ఇప్పటికే ఒక లేఖ ద్వారా 71 ఏళ్ల రాకేష్ కిషోర్ పై చట్టపరమైన చర్యలు ప్రారంభించడానికి అనుమతి కోరినట్లు సమాచారం. ఈ సంఘటన భారత న్యాయ వ్యవస్థలో పెద్ద చర్చనీయాంశంగా మారింది. న్యాయవర్గంలోనూ, సామాజిక వర్గాల్లోనూ దీని గురించి విస్తృతంగా చర్చ జరుగుతోంది.