పాట్నలో సమావేశమైన ప్రతిపక్ష కూటమిని 'వాగ్నర్ గ్రూప్' గా పోల్చిన ఉద్ధవ్ ఠాక్రే
ఈ వార్తాకథనం ఏంటి
కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వానికి వ్యతిరేకంగా పోరాడుతున్న ప్రతిపక్షాల కూటమిని రష్యా కిరాయి సైన్యం వాగ్నర్ గ్రూప్‌తో ఉద్ధవ్ థాకరే నేతృత్వంలోని శివసేన పత్రిక సామ్నా సంపాదకీయం పేర్కొంది.
రష్యా అధ్యక్షుడు వ్లాదిమిర్ పుతిన్‌పై వాగ్నర్ గ్రూప్ తిరుగుబాటు చేసినట్లే ప్రధాని నరేంద్ర మోదీని సవాలు చేసేందుకు ప్రతిపక్షాలు పాట్నలో సమావేశమయ్యాయని వెల్లడించింది.
రష్యాలోని జైళ్ల నుంచి రిక్రూట్ చేయబడిన దోషులతో ఏర్పడిన వాగ్నర్ గ్రూప్‌తో దేశంలోని ప్రతిపక్షాలను పోల్చడం గమనార్హం.
అయితే భారతదేశంలోని ప్రతిపక్ష నేతల వాగ్నర్ గ్రూప్ కిరాయి సైన్యం కాదని, ప్రజాస్వామ్య పరిరక్షణకు పోరాడుతుందని చెప్పింది.
ఎన్నికల్లో విజయం సాధించేందుకు, ఓటర్లపై ఒత్తిడి తేవడానికి మోదీ-షాలు పెద్ద సంఖ్యలో కిరాయి సైనికులను సిద్ధం చేశారని సామ్నా సంపాదకీయం వెల్లడించింది.
శివసేన
ఆ ప్రశ్నతో ప్రధాని కాళ్ల కింద నేల కదిలింది: సామ్నా
పుతిన్ లాగానే మోదీ-షాలు కూడా నియంతృత్వ, నిరంకుశ విధానాలను దేశంలో అవలంబించే ప్రయత్నం చేస్తున్నారని సామ్నా సంపాదకీయం స్పష్టం చేసింది.
ప్రధాని నరేంద్ర మోదీ అమెరికా పర్యటన గురించి మాట్లాడుతూ.. వచ్చీరాని ఇంగ్లిష్ మాట్లాడి మోదీ తనను తాను తక్కువ చేసుకున్నారని పేర్కొంది.
భారత ప్రజాస్వామ్యం, రాజ్యాంగం, మైనారిటీలపై దాడిపై వైట్ హౌస్‌లో జరిగిన విలేకరుల సమావేశంలో అడిగిన ప్రశ్నల వల్ల ప్రధాని మోదీ కాళ్ల కింద నుంచి నేల కదిలినట్లు స్పష్టంగా కనిపించిందని వెల్లడించింది.