Page Loader
Congress: కాంగ్రెస్‌లో చేరిన బీఆర్ఎస్ ఎమ్మెల్యేలకు శాసనసభ నోటీసులు
కాంగ్రెస్‌లో చేరిన బీఆర్ఎస్ ఎమ్మెల్యేలకు శాసనసభ నోటీసులు

Congress: కాంగ్రెస్‌లో చేరిన బీఆర్ఎస్ ఎమ్మెల్యేలకు శాసనసభ నోటీసులు

వ్రాసిన వారు Jayachandra Akuri
Feb 04, 2025
11:44 am

ఈ వార్తాకథనం ఏంటి

కాంగ్రెస్‌ పార్టీలో చేరిన బీఆర్ఎస్ ఎమ్మెల్యేలకు శాసనసభ కార్యదర్శి నోటీసులు జారీ చేశారు. బీఆర్‌ఎస్‌ తరఫున దాఖలు చేసిన అనర్హత పిటిషన్‌ ఆధారంగా ఈ నోటీసులు పంపించారు. దీంతో ఎమ్మెల్యేలు వివరణ ఇవ్వడానికి సమయం కోరారు.2024 మేలో జరిగిన పార్లమెంట్ ఎన్నికల సమయంలో, బీఆర్ఎస్‌కు చెందిన 10 మంది ఎమ్మెల్యేలు ఆ పార్టీని వీడి కాంగ్రెస్‌లో చేరారు.

Details

సుప్రీం కోర్టును అశ్రయించిన బీఆర్ఎస్

వారు దానం నాగేందర్, కడియం శ్రీహరి, కాలే యాదయ్య, బండ్ల కృష్ణమోహన్ రెడ్డి, తెల్లం వెంకట్రావు, పోచారం శ్రీనివాస్ రెడ్డి, ఎం. సంజయ్ కుమార్, ప్రకాశ్ గౌడ్, గూడెం మహిపాల్ రెడ్డి, అరికెపూడి గాంధీ. ఈ పార్టీ ఫిరాయించిన ఎమ్మెల్యేలు తమను తాము గౌరవించాలంటూ స్పీకర్‌కు ఫిర్యాదు చేశారు. అయితే ఎలాంటి చర్యలు తీసుకోకపోవడంతో, సుప్రీంకోర్టు, హైకోర్టును బీఆర్ఎస్ ఆశ్రయించింది. ఈ పిటిషన్‌పై సుప్రీంకోర్టు విచారించడంతో తాజాగా అసెంబ్లీ సెక్రటరీ పార్టీ ఫిరాయించిన ఎమ్మెల్యేలకు నోటీసులు ఇచ్చారు.