తదుపరి వార్తా కథనం

Lella Appireddy: వైసీపీ ఎమ్మెల్సీ లేళ్ల అప్పిరెడ్డి అరెస్ట్
వ్రాసిన వారు
Sirish Praharaju
Sep 05, 2024
05:26 pm
ఈ వార్తాకథనం ఏంటి
వైసీపీ ఎమ్మెల్సీ లేళ్ల అప్పిరెడ్డిని మంగళగిరి పోలీసులు అరెస్టు చేశారు. టీడీపీ కార్యాలయంపై దాడి కేసులో ఆయన్ని పోలీసులు అదుపులోకి తీసుకున్నారు.
ఈ కేసులో ఇప్పటికే బాపట్ల మాజీ ఎంపీ నందిగం సురేశ్‌ను కూడా పోలీసులు అరెస్టు చేశారు.
వైసీపీ నేతలు దేవినేని అవినాష్, తలశిల రఘురామ్ తదితరుల కోసం గుంటూరు, బాపట్ల, పల్నాడు జిల్లాల పోలీసులతో కలిసి 12 బృందాలను ఏర్పాటు చేశారు.
హైకోర్టు ముందస్తు బెయిల్ నిరాకరించడంతో నిందితులంతా అజ్ఞాతంలోకి వెళ్లిపోయారు.
మాజీ ఎంపీ నందిగం సురేశ్‌ను పోలీసులు గురువారం సాయంత్రం మంగళగిరి కోర్టులో హాజరుపరిచారు.
న్యాయమూర్తి సురేశ్‌కు రెండు వారాల రిమాండ్ విధించాలని ఆదేశించారు. తక్షణమే ఆయనను గుంటూరు జిల్లా జైలుకు తరలించనున్నారు.