Page Loader
Nandigam Suresh: వైసీపీ మాజీ ఎంపీ నందిగం సురేశ్‌ అరెస్ట్ 
వైసీపీ మాజీ ఎంపీ నందిగం సురేశ్‌ అరెస్ట్

Nandigam Suresh: వైసీపీ మాజీ ఎంపీ నందిగం సురేశ్‌ అరెస్ట్ 

వ్రాసిన వారు Sirish Praharaju
Sep 05, 2024
09:24 am

ఈ వార్తాకథనం ఏంటి

వైసీపీ నేత, బాపట్ల మాజీ ఎంపీ నందిగం సురేశ్‌ను పోలీసులు అరెస్ట్ చేశారు. గుంటూరు జిల్లా మంగళగిరిలోని తెలుగుదేశం కేంద్ర కార్యాలయంపై జరిగిన దాడి కేసులో, సురేశ్‌తో పాటు మరికొందరు వైస్సార్సీపీ నేతలపై కేసులు నమోదు అయ్యాయి. ఈ కేసులో ముందస్తు బెయిల్ కోసం వారు హైకోర్టులో పిటిషన్ దాఖలు చేయగా,దాని కోర్టు కొట్టేసింది. బుధవారం,తుళ్లూరు పోలీసులు సురేశ్ ఇంటికి వెళ్లి అరెస్ట్ చేసేందుకు ప్రయత్నించారు, కానీ అయన అక్కడ లేరని తెలియడంతో వెనుదిరిగారు.

వివరాలు 

హైదరాబాద్‌లో సురేశ్‌ అరెస్ట్

అనంతరం,సురేశ్ భయంతో అజ్ఞాతంలోకి వెళ్లి సెల్‌ఫోన్ స్విచ్ఆఫ్ చేశారు.పోలీసులు సిగ్నల్స్ ఆధారంగా ఆయన ఆచూకీ తెలుసుకునే ప్రయత్నం చేశారు. హైదరాబాద్‌లో ఉండి పారిపోవడానికి ప్రయత్నిస్తున్నారనే సమాచారంతో పోలీసులు అక్కడికి వెళ్లి సురేశ్‌ను అరెస్ట్ చేశారు. ఈ కేసులో నిందితులుగా ఉన్న లేళ్ల అప్పిరెడ్డి, దేవినేని అవినాష్, తలశిల రఘురామ్ వంటి నేతలు కూడా అజ్ఞాతంలోకి వెళ్లిపోయారు. వీరిని వెతకటానికి గుంటూరు, బాపట్ల, పల్నాడు జిల్లాల పోలీసులతో కలిపి 12 బృందాలను ఏర్పాటుచేశారు.