Page Loader
Supreme Court: పహల్గామ్ దాడి కేసుపై సుప్రీంకోర్టు.. బలగాల స్థైర్యాన్ని దెబ్బతీయొద్దు
పహల్గామ్ దాడి కేసుపై సుప్రీంకోర్టు.. బలగాల స్థైర్యాన్ని దెబ్బతీయొద్దు

Supreme Court: పహల్గామ్ దాడి కేసుపై సుప్రీంకోర్టు.. బలగాల స్థైర్యాన్ని దెబ్బతీయొద్దు

వ్రాసిన వారు Sirish Praharaju
May 01, 2025
02:00 pm

ఈ వార్తాకథనం ఏంటి

పహల్గాంలో జరిగిన ఉగ్రదాడిపై న్యాయ విచారణ జరిపించాలని కోరుతూ దాఖలైన ప్రజా ప్రయోజన వ్యాజ్యాన్ని (PIL) సుప్రీంకోర్టు తిరస్కరించింది. ఈ సందర్భంగా ధర్మాసనం కీలక వ్యాఖ్యలు చేసింది. భారత భద్రతా దళాలు ప్రస్తుతం పాకిస్తాన్‌కు ప్రతీకార చర్యలు తీసుకునేందుకు సన్నద్ధమవుతున్న నేపథ్యంలో,ఇలాంటి పరిస్థితుల్లో భద్రతా బలగాల నైతిక స్థైర్యాన్ని దెబ్బతీయకూడదని కోర్టు స్పష్టం చేసింది. పిటీషన్‌ను దాఖలు చేసిన వ్యక్తిపై సుప్రీంకోర్టు అసహనం వ్యక్తం చేసింది. "ఇది అత్యంత సున్నితమైన అంశం.భద్రతా దళాలు ప్రాణాలను త్యాగం చేస్తూ దేశాన్ని కాపాడుతున్న సమయంలో,వారి మనోధైర్యాన్ని తగ్గించే ప్రయత్నాలు చేయొద్దు.దేశ పౌరులుగా బాధ్యతాయుతంగా ప్రవర్తించాల్సిన అవసరం ఉంది.మేము దర్యాప్తు నిపుణులం కాదు. దేశమంతా ఐక్యతగా ముందుకెళ్లాల్సిన సమయం ఇది" అంటూ ధర్మాసనం తీవ్ర వ్యాఖ్యలు చేసింది.

వివరాలు 

సుప్రీంకోర్టు సూచనలతో పిటీషనర్ పిటిషన్‌ ఉపసంహరణ 

ఇక, సొలిసిటర్ జనరల్ తుషార్ మెహతా సైతం పిటీషనర్‌కు హైకోర్టును ఆశ్రయించేందుకు అనుమతి ఇవ్వొద్దని విజ్ఞప్తి చేశారు. చివరికి, సుప్రీంకోర్టు సూచనలతో పిటీషనర్ తన పిటిషన్‌ను స్వచ్ఛందంగా ఉపసంహరించుకున్నారు.