Letter-vs-letter: 'రాహుల్ ఫెయిల్డ్ ప్రొడక్ట్'.. ఖర్గేకు సమాధానంగా నడ్డా
ఈ వార్తాకథనం ఏంటి
దేశంలోని ప్రధాన రాజకీయ పార్టీలైన బీజేపీ (BJP) కాంగ్రెస్ (Congress) అధ్యక్షులు పరస్పర లేఖల ద్వారా ఆరోపణలు చేసుకున్నారు.
ఇటీవల, కాంగ్రెస్ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గే ప్రధాన మంత్రి నరేంద్ర మోదీకి (PM Modi) లేఖ రాశారు.
బీజేపీ నాయకులు రాహుల్ గాంధీపై (Rahul Gandhi) అనుచిత వ్యాఖ్యలు చేశారని ఆయన ఆరోపించారు.
దీనికి గురువారం బీజేపీ అధ్యక్షుడు జేపీ నడ్డా కౌంటర్ ఇచ్చారు.
వివరాలు
కాంగ్రెస్ కాపీ పేస్ట్ పార్టీ: నడ్డా
రాహుల్ గాంధీని లక్ష్యంగా చేసుకుని బీజేపీ నేతలు వివాదాస్పద, హింసాత్మక వ్యాఖ్యలు చేస్తున్నారని ఖర్గే తన లేఖలో తెలిపారు.
ఈ వ్యాఖ్యలు చేసే నాయకులను క్షమాపణలు చెప్పేలా చర్యలు తీసుకోవాలని ఆయన కోరారు.
దానికి నడ్డా బదులిస్తూ.. రాహుల్‌ను ఒక "ఫెయిల్డ్ ప్రొడక్ట్"గా అభివర్ణించారు.
కాంగ్రెస్ పార్టీ ఆ ప్రొడక్ట్‌ను విజయవంతం మార్కెట్ చేసేందుకు ప్రయత్నిస్తోందని ఆయన ఎద్దేవా చేశారు.
అలాగే, రాహుల్ ఒత్తిడి కారణంగా కాంగ్రెస్ కాపీ పేస్ట్ పార్టీగా మారిందని నడ్డా విమర్శించారు.