Page Loader
G-20 సదస్సుకు వేళాయే.. నేడు దిల్లీకి ప్రపంచ దేశాధినేతల రాక
నేడు దిల్లీకి ప్రపంచ దేశాధినేతల రాక

G-20 సదస్సుకు వేళాయే.. నేడు దిల్లీకి ప్రపంచ దేశాధినేతల రాక

వ్రాసిన వారు TEJAVYAS BESTHA
Sep 08, 2023
11:32 am

ఈ వార్తాకథనం ఏంటి

G-20 శిఖరాగ్ర సమావేశానికి వేళైంది. సదస్సులో పాల్గొనేందుకు అగ్ర దేశాధినేతలు, ఆహ్వాన దేశాల ప్రతినిధులు శుక్రవారం వరుసగా భారత్‌ చేరుకోనున్నారు. ఈ మేరకు ఉదయం 5 గంటల నుంచే జాతీయ రాజధానిలో కఠినమైన ట్రాఫిక్ ఆంక్షలు మొదలయ్యాయి.ఆదివారం రాత్రి 11.59 గంటల వరకు ఈ ఆంక్షలు కట్టుదిట్టంగా కొనసాగనున్నాయి. అమెరికా, ఫ్రాన్స్‌, బ్రిటన్‌, కెనడా వంటి అగ్ర దేశాధినేతలు సహా ఇతర ప్రముఖులు భారత ఆతిథ్యం అందుకునేందుకు ఏర్పాట్లు పూర్తయ్యాయి. జీ-20 కూటమిలోని 20 సభ్యదేశాలు, 11 ఆహ్వాన దేశాలు, ఐరాస, ఐఎంఎఫ్‌, ప్రపంచ బ్యాంకు తదితర అంతర్జాతీయ సంస్థల అధినేతలు ఈ కీలక సమావేశంలో పాల్గొననున్నారు. ఈ నేపథ్యంలోనే దేశ రాజధానిలో 5 వేల సీసీ కెమెరాలతో పోలీసులు జల్లెడ పడుతున్నారు.

DETAILS

మధ్యాహ్నం 1.40 గంటలకు దిల్లీలో దిగనున్న రిషి సునాక్

ట్రాఫిక్ ఇబ్బందులు లేకుండా ఉండేందుకు పాఠశాలలకు, బ్యాంకులు, కేంద్ర రాష్ట్ర ప్రభుత్వం ఉద్యోగులకు గతంలోనే సెలవులు ప్రకటించారు. అంబులెన్స్‌లు, మందులు, ఇతర అత్యవసర సర్వీస్ వారికి ఆంక్షల నుంచి మినహాయింపు ఇచ్చారు. నివాస ప్రాంతంలో వాకింగ్, సైక్లింగ్ కోసం ఇండియా గేట్, కర్తవ్యపాత్‌ సందర్శనకు అనుమతి లేదు.పొరుగు రాష్ట్రాల సరిహద్దులు సైతం నిలిపేశారు.లక్షకుపైగా పోలీసులు, భద్రతా సిబ్బంది దిల్లీ వీధుల్లో గస్తీ చేయనున్నారు. ఫైటర్ జెట్‌లు, అధునాతన AI-ఆధారిత కెమెరాలు, జామింగ్ పరికరాలు, స్నిఫర్ డాగ్‌లను విస్తృతంగా ఉపయోగించనున్నారు. శుక్రవారం మధ్యాహ్నం 1.40 గంటలకు దిల్లీ విమానాశ్రయంలో భారత మూలాలున్న యూకే ప్రధాన మంత్రి రిషి సునాక్‌ దిగనున్నారు.ఈ మేరకు కేంద్ర సహాయమంత్రి అశ్విని కుమార్‌ చౌబే ఆయనకు ఘన స్వాగతం పలకనున్నారు.