Page Loader
 G-20 సమావేశం సన్నాహాలపై ప్రధాని మోదీ సమీక్ష.. కేంద్రమంత్రులకు దిశానిర్దేశం
కేంద్రమంత్రులకు దిశానిర్దేశం

 G-20 సమావేశం సన్నాహాలపై ప్రధాని మోదీ సమీక్ష.. కేంద్రమంత్రులకు దిశానిర్దేశం

వ్రాసిన వారు TEJAVYAS BESTHA
Sep 07, 2023
07:18 pm

ఈ వార్తాకథనం ఏంటి

భారత్ ప్రతిష్టాత్మకంగా నిర్వహిస్తున్న G-20 శిఖరాగ్ర సమావేశాలకు సన్నాహాలు జరుగుతున్నాయి.ఈ మేరకు ప్రధాని మోదీ పర్యవేక్షించనున్నారు. ఆసియాన్-భారత్ సదస్సుకు హాజరైన మోదీ, ఇండోనేషియా నుంచి ఇప్పటికే బయల్దేరారు. దిల్లీ చేరిన వెంటనే ఈ మేరకు ఏర్పాట్లపై సమీక్ష చేయనున్నారు. గురువారం సాయంత్రం దిల్లీ చేరుకున్నాక, సుష్మా స్వరాజ్ భవన్‌లో క్యాబినెట్ మంత్రులతో సమావేశమవుతారు. ఈక్రమంలోనే G-20 సదస్సుకు సంబంధించిన సన్నాహాలను వివరించనున్నారు. సెప్టెంబర్ 9,10లో జరగనున్న సదస్సుకు అమెరికా అధ్యక్షుడు జో బిడెన్, బ్రిటన్ ప్రధాని రిషి సునక్, కెనడా ప్రధాని జస్టిన్ ట్రూడో సహా ఇతర నేతలు ఈనెల 8 నుంచి వరుసగా దిల్లీ చేరుకోనున్నారు. G-20 ముగింపులో ఫ్రాన్స్ అధ్యక్షుడు ఇమ్మాన్యుయేల్ మాక్రాన్, మోదీతో ద్వైపాక్షిక భేటీ కానున్నారు.

ట్విట్టర్ పోస్ట్ చేయండి

భోజన విరామంలో భాగంగా ఫ్రాన్స్-భారత్ ద్వైపాక్షిక భేటీ