Page Loader
G-20 సమావేశం: ప్రపంచ దేశాధినేతల బస ఇక్కడే..ఏ హోటల్లో ఎవరు ఉంటారో తెలుసా
అగ్రరాజ్యాధిపతి జో బైడెన్ బస చేసేది ఇక్కడే

G-20 సమావేశం: ప్రపంచ దేశాధినేతల బస ఇక్కడే..ఏ హోటల్లో ఎవరు ఉంటారో తెలుసా

వ్రాసిన వారు TEJAVYAS BESTHA
Sep 07, 2023
04:21 pm

ఈ వార్తాకథనం ఏంటి

దిల్లీ వేదికగా సెప్టెంబర్ 9, 10న జరగనున్న G-20 శిఖరాగ్ర సమావేశాల సందర్భంగా ప్రపంచ దేశాధినేతలు భారత్ రానున్నారు. ఈ మేరకు జాతీయ రాజధాని నగరంలోని పలు హోటళ్లలో గ్లోబల్ లీడర్లు బసచేయనున్నారు. ఈ నేపథ్యంలోనే మొత్తం 23 హోటళ్లు,ఎన్‌సీఆర్‌ పరిధిలోని తొమ్మిది హోటళ్లు ప్రతిష్టాత్మకమైన G-20 డెలిగేట్స్‌కు ఆతిథ్యం ఇవ్వనున్నాయి. ఐటీసీ మౌర్య, తాజ్‌ మాన్‌సింగ్‌, తాజ్‌ ప్యాలెస్‌, హోటల్‌ ఒబెరాయ్‌, హోటల్‌ లలిత్‌, ది లోధి, లీ మెరిడియన్‌, హయత్‌ రీజెన్సీ, షాంగ్రిలా, లీలా ప్యాలెస్‌, హోటల్‌ అశోకా, ఈరోస్‌ హోటల్‌, ది సూర్య రాడిసన్‌ బ్లూ ప్లాజా, జెడబ్ల్యు మారియెట్‌, షెర్టాన్‌, ది లాలా అంబియెన్స్‌ కన్వెన్సన్‌, హోటల్‌ పుల్‌మాన్‌, రోసెట్టి హోటల్‌, ది ఇంపీరియల్‌ లాంటి హోటళ్లున్నాయి.

DETAILS

ఐటీసీ మోర్యా షెర్టాన్‌లో బస చేయనున్న జో బైడెన్

మరోవైపు జాతీయ రాజధాని పరిధిలో వివాంతా, ఐటీసీ గ్రాండ్‌, తాజ్‌ సిటీ, హయత్‌ రీజెన్సీ, ది ఒబెరాయ్‌, వెస్ట్‌ ఇన్‌, క్రౌన్‌ ప్లాజాలాంటి హోటల్స్‌ ఉన్నాయి. 1. ఐటీసీ మౌర్యా షెర్టాన్‌ - అగ్రరాజ్యధిపతి యూఎస్ ప్రెసిడెంట్ జో బైడెన్ 2. తాజ్‌ ప్యాలెస్‌ - చైనా ప్రెసిడెంట్‌ షీ జిన్‌పింగ్‌, ప్రతినిధులు 3. షాంగ్రీ లా - బ్రిటన్‌ ప్రధాన మంత్రి రిషి సునాక్‌ 4. క్లారిడ్జెస్‌ - ఫ్రెంచ్ ప్రెసిడెంట్‌ ఎమ్మాన్యూయెల్‌ మక్రాన్‌ 5. ఇంపీరియర్‌ - అస్ట్రేలియా ప్రధాని ఆంథోని అల్బనీస్‌ 6. ఒబెరాయ్‌ - టర్కీస్‌ డెలిగేషన్‌ 7. హోటల్ లలిత్ - కెనడా ప్రధాన మంత్రి జస్టిన్ ట్రూడో

DETAILS

 కొరియాకు గురుగ్రామ్‌లోని ఒబెరాయ్‌ హోటల్‌లో బస

మారిషస్‌, నెదర్లాండ్స్‌, నైజీరియా, స్పెయిన్‌కు చెందిన బృందాలు లీ మెరిడియన్‌లో బస చేయనున్నారు. బ్రెజిల్‌కు చెందిన ప్రతినిధులు తాజ్‌ ప్యాలెస్‌లో, ఇండోనేషియాకు చెందిన డెలిగేషన్స్‌ ఇంపీరియల్‌ హోటల్‌ను కేటాయించారు. షాంగ్రిలాలో యూకేతో పాటు జర్మనీ డెలిగేషన్స్‌కు అలాట్ చేశారు. హయత్‌ రెజెన్సీ దిల్లీలో మాత్రం ఇటాలియన్‌, సింగపూర్‌ ప్రతినిధులకు వసతి కల్పిస్తున్నారు. ఒమాన్‌కు లోది హోటల్‌, బంగ్లాదేశ్‌కు గ్రాండ్‌ హయత్‌ గురుగ్రామ్‌లో కేటాయించారు. కెనడా, జపాన్‌కు చెందిన ప్రతినిధులకు హోటల్ లలిత్‌ దిల్లీలో బస ఏర్పాటు చేశారు.దక్షిణ కొరియాకు గురుగ్రామ్‌లోని ఒబెరాయ్‌ హోటల్‌లో సిద్ధం చేశారు. ఈజిప్టుకు ఐటీసీ షెర్టాన్, సౌదీకి లీలా హోటల్‌ గురుగ్రామ్‌లో బస రెడి చేశారు. మరోవైపు యూఏఈ డెలిగేట్స్‌ కోసం దిల్లీ తాజ్‌మహల్‌ హోటల్‌లో బస చేయనున్నారు.