పేరు మార్పు అభ్యర్థనలు వచ్చినప్పుడు పరిశీలిస్తాం: ఐక్యరాజ్యసమితి
G20 ఆహ్వాన పత్రికలో 'ప్రెసిడెంట్ ఆఫ్ భారత్'పేరిట రాష్ట్రపతి ద్రౌపది ముర్ము నుండి అన్ని పక్షాలకు ఆహ్వానాలు అందడంతో దేశం పేరుపై రాజకీయ వివాదం మొదలైంది. ఈ విషయమై ఐక్యరాజ్య సమితి స్పందించింది.తమ దేశం పేర్ల మార్పుపై ఏ దేశం నుండైనా అభ్యర్థనలు వస్తే..ఐరాస వాటిని స్వీకరించి పరిగణనలోకి తీసుకుంటుందని తెలిపింది. భారతదేశం పేరును భారత్‌గా మారుస్తారా అంటూ విలేఖరులు అడిగిన ప్రశ్నకు..ఐక్యరాజ్యసమితి సెక్రటరీ జనరల్ ఆంటోనియో గుటెర్రెస్,డిప్యూటీ అధికార ప్రతినిధి ఫర్హాన్ హక్ స్పందించారు. టర్కీ తన పేరును తుర్కియేగా మార్చుకున్న ఉదాహరణను ఉదహరించారు.తుర్కియే విషయంలో,ఆ దేశ ప్రభుత్వం మాకు పంపిన అధికారిక అభ్యర్థనను మేము స్వీకరించాము. సహజంగానే, మాకు అలాంటి అభ్యర్థనలు ఏమైనా వస్తే, వాటిని మేముపరిగణలోకి తీసుకుంటామని తెలిపారు.
దేశం పేరు మార్పుపై స్పందించిన మోదీ
ప్రెసిడెంట్ ముర్ము G20 విందుకు ఆహ్వానాలు పంపిన తర్వాత మంగళవారం భారతదేశంలో దేశం పేరు మార్పుపై గందరగోళం చెలరేగింది. ఆహ్వాన పత్రికలో'ప్రెసిడెంట్ అఫ్ ఇండియా'కి బదులుగా 'ప్రెసిడెంట్ అఫ్ భారత్ 'అని ముద్రించారు. ఈ నేపథ్యంలో నరేంద్ర మోదీ ప్రభుత్వం దేశం పేరు ఇంగ్లీష్ లో ఇండియా బదులు భారత్ అని మార్చాలని యోచిస్తున్నట్లు ప్రతిపక్షాలు ఆరోపించాయి. అటు ఈవిషయమై ప్రధాని మోదీ స్పందింస్తూ..ఈ అంశం పై జాగ్రత్తగా వ్యవహరించాలని అనవసరమైన రాజకీయ దుమారాన్ని నివారించాలని తన మంత్రివర్గ సహచరులకు చెప్పినట్లు వార్తలొచ్చాయి. భారత అధ్యక్షతన సెప్టెంబర్ 9, 10 తేదీల్లో న్యూఢిల్లీలో G20 సమ్మిట్ జరుగుతోంది. అమెరికా అధ్యక్షుడు జో బైడెన్‌తో సహా ప్రపంచవ్యాప్తంగా పలువురు దేశాధినేతలు ఈ కార్యక్రమానికి హాజరవుతున్నారు.