Page Loader
High Court: కానిస్టేబుల్ అభ్యర్థులకు గుడ్‌న్యూస్.. సెలక్షన్స్‌కి గ్రీన్ సిగ్నల్ ఇచ్చిన హైకోర్టు
కానిస్టేబుల్ అభ్యర్థులకు గుడ్‌న్యూస్.. సెలక్షన్స్‌కి గ్రీన్ సిగ్నల్ ఇచ్చిన హైకోర్టు

High Court: కానిస్టేబుల్ అభ్యర్థులకు గుడ్‌న్యూస్.. సెలక్షన్స్‌కి గ్రీన్ సిగ్నల్ ఇచ్చిన హైకోర్టు

వ్రాసిన వారు Jayachandra Akuri
Jan 04, 2024
06:02 pm

ఈ వార్తాకథనం ఏంటి

తెలంగాణలో కానిస్టేబుల్ పోస్టుల భర్తీకి అడ్డంకి తొలగించింది. కానిస్టేబుల్ నియామకాలపై తెలంగాణ హైకోర్టు(High Court) డివిజన్ బెంచ్ తీర్పునిచ్చింది. గతంలో సింగిల్ బెంబ్ కానిస్టేబుళ్ల నియామకాలపై ఇచ్చిన తీర్పును హైకోర్టు డివిజన్ బెంచ్ కొట్టేసింది. దీంతో 15640 కానిస్టేబుల్ పోస్టులకు లైన్ క్లియర్ అయ్యింది. ఇక కానిస్టేబుల్ పత్రంలో నాలుగు ప్రశ్నలకు మార్కులు కలపాలని గతంలో సింగిల్ బెంచ్ తీర్పునిచ్చింది. దీనిపై సెలక్ట్ అయిన కానిస్టేబుల్ అభ్యర్థులు అభ్యంతరాలు తెలిపారు. ఇక ఆ తీర్పును సవాలు కూడా చేశారు.

Details

సంతోషం వ్యక్తం చేస్తున్న కానిస్టేబుల్ కు ఎంపికైన అభ్యర్థులు

నాలుగు ప్రశ్నలపై అభ్యంతరాలను నిపుణుల కమిటీ తేల్చిన తర్వాత నియామక ప్రక్రియ పూర్తి చేయాలని ధర్మాసనం ఆదేశించింది. ఇక నాలుగు వారాల్లోగా కానిస్టేబుల్‌ నియామక ప్రక్రియ పూర్తి చేయాలని పోలీసు నియామక మండలికి సూచించింది. దీంతో కానిస్టేబుల్ పోస్టులకు ఎంపికైన అభ్యర్థులు సంతోషం వ్యక్తం చేస్తున్నారు.