తదుపరి వార్తా కథనం

AP Liquor Scam Case: మద్యం కుంభకోణం కేసు.. మిథున్‌రెడ్డి, ధనుంజయ్, కృష్ణమోహన్‌లకు బెయిల్ రద్దు
వ్రాసిన వారు
Jayachandra Akuri
Aug 18, 2025
04:41 pm
ఈ వార్తాకథనం ఏంటి
ఆంధ్రప్రదేశ్‌లోని మద్యం కుంభకోణం కేసు (AP Liquor Scam Case)లో నిందితులకు పెద్ద దెబ్బ తగిలింది. వైసీపీ నాయకులు మిథున్‌రెడ్డి, ధనుంజయ్‌రెడ్డి, కృష్ణమోహన్‌రెడ్డి, బాలాజీ గోవిందప్ప దాఖలు చేసిన బెయిల్ పిటిషన్లను ఏసీబీ కోర్టు తిరస్కరించింది. ఇటీవల ఈ పిటిషన్లపై వాదనలు పూర్తి చేసిన కోర్టు, నేడు తీర్పు ప్రకటించింది. ప్రాసిక్యూషన్ వాదనను సమర్థిస్తూ, నిందితుల బెయిల్ పిటిషన్లను కోర్టు కొట్టివేసింది. ఇదే కేసులో వాసుదేవరెడ్డి, సత్యప్రసాద్ దాఖలు చేసిన ముందస్తు బెయిల్ పిటిషన్లను కూడా కోర్టు తిరస్కరించింది.