
ప్రధాని మోదీ తన ప్రసంగాన్ని ముగించారు. మూజువాణీ
ఓటుతో అవిశ్వాస తీర్మానం లోక్‌సభలో వీగిపోయినట్లు స్పీకర్
ఓం బిర్లా ప్రకటించారు. విపక్ష సభ్యుల ప్రవర్తన పార్లమెంట్
తీరుకు అనుగుణంగా లేదని స్పీకర్ అన్నారు.
సభ్యులకు సభలో సీరియస్‌నెస్ ఉండాలి కానీ కాంగ్రెస్‌లో అది కనిపించట్లేదన్నారు.సభ ప్రజల సొమ్ముతో నడుస్తోందన్న ఆయన ప్రతిక్షణం అత్యంత విలువైనదన్నారు.
ప్రజల ధనాన్ని.. సభా సమయాన్ని దుర్వినియోగం చేయకూడదన్నారు.
రాజకీయాలు బయట చేయాలి కానీ సభలో కాదని హితవు పలికారు.
దేశ అభివృద్ధి, సమగ్రత కోసం సభలో చర్చలు జరగాలి.
దేశ అభివృద్ధి, సమాజ సేవ కోసం ఆత్మబలిదానానికి కూడా వెనుకాడని
వారసత్వం నుంచి వచ్చిన వ్యక్తులం మేమన్నారు.
కన్నా దేశానికే తొలి ప్రాధాన్యమనేది మా ఆలోచన విధానం.
నేటి భారత్ ఒత్తిళ్లకు తలొగ్గదు.. సంపూర్ణ ఆత్మవిశ్వాసంతో ముందడుగు వేస్తోందన్నారు.
ఈశాన్య రాష్ట్రాలు దేశానికి కొత్త ఆర్థిక వ్యవస్థలుగా మారుతున్నాయన్న ప్రధాని మోదీ ఆగ్నేయ ఆసియాతో భారత్
అనుసంధానానికి పట్టుకొమ్మలు ఈశాన్య రాష్ట్రాలు అని అన్నారు.
ఈశాన్య రాష్ట్రాల అభివృద్ధిపై కాంగ్రెస్ ఎప్పుడైనా చిత్తశుద్ధితో పని చేసిందా అని మోడీ ప్రశ్నించారు.
కాంగ్రెస్ పార్టీ, కాంగ్రెస్ ప్రభుత్వాలు ఈశాన్య రాష్ట్రాలను ఎప్పుడైనా అక్కున చేర్చుకున్నాయా?
తొమ్మిదేళ్ల నుంచి మేము చేస్తున్న అభివృద్ధి అనుభవంతో చెబుతున్నా.. ఈశాన్య రాష్ట్రాలు మాకు అత్యంత ప్రాధాన్యమైనవన్నారు.
ఈశాన్య రాష్ట్రాల సమస్యలన్నింటికీ కాంగ్రెస్సే మూల కారణం
అన్న ఆయన కాంగ్రెస్ చేసిన కుటిర రాజకీయాలే ఈశాన్య రాష్ట్రాల్లో నిరంతర సమస్యలకు కారణమయ్యాయన్నారు.
మాజీ ప్రధాని జవహర్‌లాల్ నెహ్రూ ఉద్దేశపూర్వకంగా
ఈశాన్య ప్రాంతాలను అభివృద్ధి చేయలేదని
రామ్ మనోహర్ లోహియా ఆరోపించారని ప్రధాని
మోదీ అన్నారు.
ప్రధాని మోదీ అన్నారు.దేశాన్ని ఏకీకృతం చేయాల్సిన బాధ్యత ఏనాడు తీసుకోలేదని మోడీ అన్నారు.
ఓట్ల రాజకీయాల కోసం దేశాన్ని కులాలు, మతాలు, ప్రాంతాల పేరుతో విభజన చేశారన్నారు.
కాంగ్రెస్ చరిత్ర అంతా భరతమాతను చిన్నాభిన్నం చేయడంలోనే మునిగిపోయిందని ఆగ్రహం వ్యక్తం చేశారు.
ఓట్లు, రాజకీయాల కోసం ప్రజల మధ్య విద్వేషాలు రెచ్చగొట్టడమే కాంగ్రెస్‌కు అలవాటుగా మారిందన్నారు.
భారత్‌లో కాంగ్రెస్ అరాచకాలు చెప్పుకుంటే అనేకం ఉన్నాయని అందులో మిజోరాం మీద జరిగిన వాయుసేన దాడి వారు మర్చిపోయినట్లున్నారని ఎద్దేవా చేశారు.
మార్చి 5న ఇప్పటికీ మిజోరాం.. నిరసన దినంగా భావిస్తుందని గుర్తు చేశారు.
ఇందిరా హయాంలో 1966 లో మిజోరాంపై జరిగిన వాయుసేన దాడిని కాంగ్రెస్ ఇప్పటిదాకా దాచిపెట్టింది.
ఆరోజు మిజోరాం ప్రజలపై జరిగిన దాడి గాయం ఇప్పటికీ మానలేదని విచారం వ్యక్తం చేశారు.
మణిపూర్ గురించి ప్రధాని మోదీ గంటన్నర పాటు
ప్రస్తావించకపోవడంతో ప్రతిపక్ష ఎంపీలు వాకౌట్
చేశారు.
భారత మాతను కాంగ్రెస్ మూడు ముక్కలు చేసిందని ప్రధాని మోదీ అన్నారు.
మణిపుర్‌పై సంపూర్ణ చర్చ జరగాలనే ఆలోచన విపక్షాలకు లేదని అన్నారు మోడీ. మణిపుర్‌లో ఏం జరిగిందో నిన్న అమిత్‌షా సభకు వివరంగా చెప్పారన్నారు.
మణిపుర్‌లో జరిగింది మళ్లీ జరగకుండా అందరం కలిసి ఒక నిర్ణయానికి రావాలనే ఆలోచన విపక్షాలకు లేదన్నారు. మణిపుర్ పరిణామాలపై హోంమంత్రి నిన్న రాజకీయాలతో సంబంధం లేకుండా 2 గంటలపాటు వివరించినట్లు చెప్పారు.
మణిపుర్ ప్రజలకు ధైర్యం చెప్పాల్సిన బాధ్యత గురించి అమిత్‌షా సవివరంగా సభ ముందుంచారన్న ఆయన విపక్షాలకు మణిపుర్ ప్రజలపై ప్రేమకన్నా.. ప్రభుత్వాన్ని అప్రతిష్టపాలు చేయాలనే ఆలోచన ఎక్కువగా వుందన్నారు.
మణిపుర్‌లో విపత్కర పరిస్థితులు ఏర్పడ్డాయి.. ప్రజల మధ్య పరస్పర విశ్వాసం నశించింది, మహిళలకు ఘోర అవమానం జరిగింది.. అది మనందరికీ తలవంపులేన్నారు.
మణిపుర్‌లో శాంతి నెలకొంటుందని సాధారణ పరిస్థితులు ఏర్పడుతాయని సంపూర్ణ విశ్వాసంతో సభకు హామీ ఇస్తునామన్నారు.
ఈ సభ, దేశం సంపూర్ణంగా మణిపుర్ ప్రజలకు అండగా నిలుస్తుందన్నారు.
కాంగ్రెస్ వాళ్ల కష్టాలు చూసి మాకు కాస్త జాలి వేస్తోందన్న మోడీ పనికి రాదనుకున్న వస్తువును మళ్లీ మళ్లీ లాంచ్ చేస్తున్నారన్నారు. పనికిరాని వస్తువును ఎన్నిసార్లు లాంచ్ చేసినా పబ్లిక్ పట్టించుకోరని రాహుల్‌ను ఉద్దేశించి ప్రధాని మోదీ పరోక్ష వ్యాఖ్యలు చేశారు. పబ్లిక్ పట్టించుకోకపోతే కాంగ్రెస్ జనాన్ని దోషులుగా చేస్తుందని.. జనం మెచ్చని వస్తువులను ఎన్నిసార్లు లాంచ్ చేసినా ఆదరణ దొరకదన్నారు.
ఓ పేదవాడి కొడుకు ప్రధాని పీఠాన్ని ఎలా సాధించాడో ఆలోచిస్తున్న కాంగ్రెస్ నేతలు నిద్రలేని రాత్రులు గడుపుతున్నారని ప్రధాని మోదీ అన్నారు. వారి కుటుంబం నుంచి కాకుండా ఇతర కుటుంబం నుండి ప్రధాని అయితే సహించలేరన్నారు మోదీ .
విపక్షాల కూటమిని ‘ఘమాండీ’ అని ప్రధాని మోదీ అభివర్ణించారు. లాల్ బహదూర్ శాస్త్రి, బీఆర్ అంబేద్కర్, రామ్ మనోహర్ లోహియా వంటి ఎందరో మహానుభావులు వారసత్వ రాజకీయాలు దేశానికి నష్టదాయకమని చెప్పారు
కాంగ్రెస్‌ను టార్గెట్ చేస్తూ.. దాని పేరుతో పథకాలు అమలు చేసి మోసం చేశారని ప్రధాని అన్నారు.
కాంగ్రెస్ గుర్తింపు ఏదీ సొంతం కాదని, ఎన్నికల గుర్తు, ఆలోచన కూడా దోచుకున్నవేనని అన్నారు.
ఓటర్లను పిలిచేందుకు గాంధీ పేరు కూడా దోచుకున్నారని, ఇందులో అంతా ఒకే కుటుంబం చేతిలో కేంద్రీకృతమైందన్నారు.
తనను తాను బతికించుకోవాలంటే ఎన్డీయే మద్దతు తీసుకోవాల్సి వచ్చిందని, కానీ అలవాటు ప్రకారం ఎన్డీయేకు అహంకారానికి ప్రతీక అయిన 2 'I' లను జోడించారని ప్రధాని మోదీ అన్నారు. మొదటి 'I'26 పార్టీల అహంకారమని, రెండో 'I' కాంగ్రెస్ అహంకారమని అన్నారు.
తమిళనాడుకు చెందిన ఓ మంత్రి కొద్ది రోజుల క్రితం తనకు భారతదేశం అంటే పట్టింపు లేదని, తమిళనాడు భారతదేశంలోనే లేదని అన్నారు.
గత నెలలో బెంగళూరులో జరిగిన తమ సమావేశంలో యునైటెడ్ ప్రోగ్రెసివ్ అలయన్స్ (యుపిఎ) అంత్యక్రియలను ప్రతిపక్ష కూటమి నిర్వహించిందని ప్రధాని మోదీ చెప్పారు.
ఇంతలో ప్రతిపక్ష సభ్యులు మణిపూర్, మణిపూర్ అంటూ నినాదాలు చేశారు.
తమిళనాడు, బెంగాల్, ఉత్తరప్రదేశ్, త్రిపుర, ఒడిశా, నాగాలాండ్ రాష్ట్రాలు
ఏళ్ల తరబడి నుండి 'కాంగ్రెస్ నో కాన్ఫిడెన్స్ ' అని చెబుతున్నాయని కాంగ్రెస్‌పై ప్రధాని మోదీ మండిపడ్డారు.
ఢిల్లీ, బెంగాల్, ఆంధ్రాలో తమకు ఒక్క ఎమ్మెల్యే కూడా లేరని అన్నారు.
భారత ప్రజలు కాంగ్రెస్‌పై అవిశ్వాస తీర్మానం
పెట్టారని ప్రధాని మోదీ అన్నారు.
విపక్షాలకు భారతీయ వ్యాక్సిన్‌పై విశ్వాసం లేదని, అయితే
విదేశీ వ్యాక్సిన్‌పై విశ్వాసం ఉందని ప్రధాని మోదీ అన్నారు. విపక్షాలకు భారత్ సామర్థ్యంపై నమ్మకం లేదన్నారు.
డిజిటల్ ఇండియా గురించి మాట్లాడినపుడు అవహేళన చేశారు.జన్‌ధన్ గురించి మాట్లాడినపుడు అవహేళన చేశారు. డిజిటల్ చెల్లింపుల వ్యవస్థ ఏ స్థాయికి వెళ్లిందో మన కళ్లెదుటే కనబడుతోంది. విపక్షాలకు ఆత్మ విశ్వాసం ఉండదు. దేశీయులను నమ్మరు. మన వ్యవస్థలకన్నా పాకిస్థాన్ చెప్పే మాటలపైనే విపక్షాలకు విశ్వాసం. ఎక్కువ భారతీయ సైన్యం కంటే పాకిస్థాన్‌పైనే విపక్షాలకు నమ్మకం ఎక్కువ. భారత్‌పై వచ్చే వ్యతిరేక ప్రచారానికే ప్రతిపక్షాలు ఎక్కువ విలువిస్తాయి.
2028లో ప్రతిపక్షాలు అవిశ్వాస తీర్మానం ప్రవేశపెడితే ప్రపంచంలోని మొదటి మూడు దేశాల్లో భారత్ ఒకటిగా నిలుస్తుందని ప్రధాని మోదీ అన్నారు.