Loading...
Kashmir: కశ్మీర్‌లో స్థానిక ఉగ్రవాదుల ఖతం.. 35 మంది పాక్ ఉగ్రవాదుల కోసం వేట
కశ్మీర్‌లో స్థానిక ఉగ్రవాదుల ఖతం.. 35 మంది పాక్ ఉగ్రవాదుల కోసం వేట

Kashmir: కశ్మీర్‌లో స్థానిక ఉగ్రవాదుల ఖతం.. 35 మంది పాక్ ఉగ్రవాదుల కోసం వేట

వ్రాసిన వారు Sirish Praharaju
Nov 26, 2026
10:12 am

ఈ వార్తాకథనం ఏంటి

గత 37 ఏళ్లలో తొలిసారిగా జమ్ముకశ్మీర్‌లో స్థానిక ఉగ్రవాదుల ఉనికి దాదాపు పూర్తిగా కనుమరుగైంది. లోయలో మిగిలిన చివరి స్థానిక ఉగ్రవాది లతీఫ్ భట్ కూడా ఈ వారం ప్రారంభంలో భద్రతా దళాలతో జరిగిన ఎన్‌కౌంటర్‌లో హతమయ్యాడు. దీంతో కశ్మీర్‌లో స్థానిక ఉగ్రవాద ముఠాలు లేకుండా పోయినట్లు భద్రతా వర్గాలు వెల్లడించాయి. స్థానిక యువత నుంచి మద్దతు తగ్గిపోవడంతో పాకిస్థాన్ కొత్త వ్యూహాలకు తెరలేపినట్లు నిఘా వర్గాలు భావిస్తున్నాయి. ముఖ్యంగా శీతాకాలంలో మంచు కారణంగా పర్వత మార్గాలు మూసుకుపోయేలోపే ఉగ్రవాదులను భారత భూభాగంలోకి పంపేందుకు ప్రయత్నాలు చేస్తున్నట్లు తెలిపాయి.

వివరాలు 

స్థానికంగా ఉగ్రవాద నియామకాలు సున్నాకు..

కశ్మీర్‌లో ఉగ్రవాద సంస్థల్లో చేరుతున్న స్థానిక యువత సంఖ్య గత కొన్నేళ్లుగా భారీగా తగ్గుతూ వస్తోంది.

2018లో 196మంది యువకులు ఉగ్రవాద సంస్థల్లో చేరగా.. 2021లో 146,2022లో 121,2023లో 19,2024లో నలుగురు,2025లో ఒక్కరు మాత్రమే చేరారు.

ఈ ఏడాది ఇప్పటివరకు స్థానికంగా ఒక్కరు కూడా ఉగ్రవాద సంస్థల్లో చేరినట్లు నమోదు కాలేదు.

దీంతో స్థానికంగా ఉగ్రవాద సంస్థలకు లభిస్తున్న మద్దతు గణనీయంగా తగ్గినట్లు స్పష్టమవుతోంది.

ఈ పరిస్థితుల్లో పాకిస్థాన్ సరిహద్దుల మీదుగా విదేశీ ఉగ్రవాదులను కశ్మీర్‌లోకి పంపేందుకు ప్రయత్నిస్తున్నట్లు భద్రతా వర్గాలు పేర్కొన్నాయి.

పీర్ పంజాల్ పర్వత శ్రేణులకు ఉత్తరాన సుమారు 35మంది పాకిస్థానీ ఉగ్రవాదులు చురుగ్గా ఉన్నట్లు అధికారులు గుర్తించారు.

వీరిని పట్టుకునేందుకు భద్రతా దళాలు గాలింపు చర్యలను ముమ్మరం చేశాయి.

వివరాలు 

మారిన పాక్ వ్యూహం.. ఆపరేషన్ సిందూర్ ప్రభావం

నియంత్రణ రేఖ (ఎల్‌ఓసీ) వెంబడి పాకిస్థాన్ తన ఉగ్రవాద శిబిరాలను మళ్లీ చురుగ్గా మార్చినట్లు నిఘా వర్గాలు గుర్తించాయి.

అయితే గతంలో పెద్ద సంఖ్యలో ఉగ్రవాదులను ఒకేసారి పంపే విధానానికి బదులుగా ఇప్పుడు చిన్న బృందాలతో చొరబాటుకు ప్రయత్నిస్తోంది.

లష్కరే తోయిబా, జైషే మహ్మద్ సంస్థలకు చెందిన ఇద్దరు లేదా ముగ్గురు సభ్యులతో కూడిన బృందాలను సిద్ధం చేస్తున్నట్లు సమాచారం.

ఆపరేషన్ సిందూర్ సమయంలో భారత్ పాకిస్థాన్‌లోని పలు కీలక ఉగ్రవాద స్థావరాలను ధ్వంసం చేసింది.

వీటిలో బహావల్‌పూర్‌లో ఉన్న జైషే మహ్మద్ ప్రధాన కార్యాలయం 'మర్కజ్ సుభాన్ అల్లా' కూడా ఉంది.

ఈ దాడుల తర్వాత పాకిస్థాన్ తన చొరబాటు వ్యూహాన్ని మార్చుకున్నట్లు భద్రతా వర్గాలు విశ్లేషిస్తున్నాయి.

ADVERTISEMENT

వివరాలు 

భద్రత కట్టుదిట్టం.. ఉగ్రవాదుల ఆస్తుల జప్తు

మరోవైపు, శీతాకాలంలోనూ సరిహద్దుల్లో ఉద్రిక్తతలు కొనసాగించేందుకు పాకిస్థాన్ బార్డర్ యాక్షన్ టీమ్ (బీఏటీ) దాడులకు పాల్పడే అవకాశం ఉందని నిఘా సంస్థలు హెచ్చరించాయి.

ఉగ్రవాదులు అడవులు, సహజసిద్ధమైన గుహల్లో తలదాచుకోకుండా భద్రతా దళాలు ప్రత్యేక చర్యలు చేపట్టాయి.

ఎత్తైన పర్వత ప్రాంతాలు, అటవీ ప్రాంతాల్లో వారి కదలికలను గుర్తించి అడ్డుకునేందుకు దాదాపు 100 తాత్కాలిక కార్యాచరణ స్థావరాలను ఏర్పాటు చేశాయి.

వీటి ద్వారా ఉగ్రవాదుల సంచారంపై నిరంతరం నిఘా కొనసాగించనున్నాయి.

ADVERTISEMENT

వివరాలు 

భద్రత కట్టుదిట్టం.. ఉగ్రవాదుల ఆస్తుల జప్తు

మరోవైపు, పీర్ పంజాల్ పర్వత శ్రేణులకు దక్షిణాన గతంలో ఉగ్రవాదులకు సహకరించిన నెట్‌వర్క్‌ను నిర్వీర్యం చేసే చర్యలు కొనసాగుతున్నాయి.

ఏళ్ల క్రితమే పాకిస్థాన్‌కు పారిపోయి, అక్కడి నుంచి మళ్లీ ఉగ్రవాద కార్యకలాపాలను ప్రోత్సహించేందుకు ప్రయత్నిస్తున్న వారి వివరాలను అధికారులు సేకరించారు.

వారు స్వదేశంలో ఉన్న తమ భూములు, ఇతర ఆస్తులను విక్రయించి ఉగ్రవాద కార్యకలాపాలకు నిధులు సమకూర్చకుండా చర్యలు తీసుకుంటున్నారు.

ఇందులో భాగంగా వారి ఆస్తులను జప్తు చేస్తున్నారు.

స్థానికంగా ఉగ్రవాద నియామకాలు తగ్గిన నేపథ్యంలో విదేశీ ఉగ్రవాదుల చొరబాటును అడ్డుకోవడంతోపాటు, వారికి సహకరించే పాత వ్యవస్థలను కూడా పూర్తిగా దెబ్బతీయడంపై భద్రతా సంస్థలు దృష్టి సారించాయి.

ADVERTISEMENT