Lok Sabha: లోక్‌సభలో గందరగోళం.. సోమవారానికి వాయిదా..!
ఈ వార్తాకథనం ఏంటి
లోక్‌సభ (Lok Sabha)లో గందరగోళం ఇవాళ కూడా కొనసాగింది. గురువారం రాజ్యసభలో ప్రధాని నరేంద్ర మోదీ చేసిన వ్యాఖ్యలపై విపక్ష సభ్యులు అభ్యంతరం వ్యక్తం చేశారు. వారి నాయకుడికి మాట్లాడే అవకాశం ఎందుకు ఇవ్వలేదని లోక్‌సభలోని సభ్యులు ప్రశ్నించారు. కొంతమంది సభ్యులు ప్రభుత్వాన్ని వ్యతిరేకిస్తూ నినాదాలు చేశారు,ప్లకార్డులు ప్రదర్శించారు. స్పీకర్ వీరిని శాంతపరచడానికి ప్రయత్నించినప్పటికీ వారు వినిపించకపోవడంతో సభను సోమవారానికి వాయిదా వేశారు. ఈబడ్జెట్ సెషన్‌లో ఇప్పటివరకు 19గంటల 13నిమిషాల సమయం వృథా అయింది. సభను సోమవారం ఉదయం 11గంటల వరకు వాయిదా వేస్తున్నట్లు ప్రకటించారు. పార్లమెంట్‌లో తొలివిడత బడ్జెట్ సమావేశాలు ఈనెల 13న ముగియనుండగా,రెండో విడత సమావేశాలు మార్చి 9న ప్రారంభం కానున్నాయి. ఫిబ్రవరి 9నుంచి లోక్‌సభలో బడ్జెట్ చర్చలు ప్రారంభమవుతాయి.
ట్విట్టర్ పోస్ట్ చేయండి
సోమవారం ఉదయం 11గంటల వరకు వాయిదా
Lok Sabha Adjourned: संसद के बजट सत्र के दौरान लोकसभा की कार्यवाही को स्थगित कर दिया गया है। अब सदन की अगली बैठक 9 फरवरी 2026 को सुबह 11 बजे होगी। हंगामे और विभिन्न मुद्दों पर चर्चा के चलते कार्यवाही रोकी गई। सांसदों की अगली उपस्थिति पर सभी की नजरें टिकी हैं।
— Aryan TV National News (@ATVNATIONAL) February 6, 2026
.
.
.#NarendraModi… pic.twitter.com/UypcMV7RDC