Page Loader
Three Criminal Law Bills: సస్పెండ్ అయ్యిన 97మంది ఎంపీల గైర్హాజరీలో.. లోక్‌సభలో ఆమోదం పొందిన మూడు క్రిమినల్ లా బిల్లులు 
లోక్‌సభలో ఆమోదం పొందిన మూడు క్రిమినల్ లా బిల్లులు

Three Criminal Law Bills: సస్పెండ్ అయ్యిన 97మంది ఎంపీల గైర్హాజరీలో.. లోక్‌సభలో ఆమోదం పొందిన మూడు క్రిమినల్ లా బిల్లులు 

వ్రాసిన వారు Sirish Praharaju
Dec 20, 2023
06:00 pm

ఈ వార్తాకథనం ఏంటి

భారతీయ శిక్షాస్మృతి స్థానంలో భారతీయ న్యాయ సంహిత, క్రిమినల్ ప్రొసీజర్ కోడ్ స్థానంలో భారతీయ నాగరిక్ సురక్ష సంహిత, భారతీయ సాక్ష్యా సంహిత అనే మూడు సవరించిన క్రిమినల్ చట్ట బిల్లులను లోక్‌సభ బుధవారం ఆమోదించింది. ఈ వారం సస్పెండ్ అయిన 97 మంది ఎంపీల గైర్హాజరీలో వివాదాస్పద బిల్లును దిగువ సభ ఆమోదించింది. అంతకముందు ఈ ఏడాది ఆగస్టులో జరిగిన పార్లమెంట్‌ సమావేశాల్లో తొలిసారిగా ఈ బిల్లులను ప్రవేశపెట్టారు. అయితే, వీటిపై అప్పట్లో అభ్యంతరాలు వ్యక్తమవడంతో ప్రస్తుతం జరిగిన శీతాకాల సమావేశాల్లో వీటిని కేంద్రం వెనక్కు తీసుకుంది. అనంతరం వీటిలో మార్పులు చేసి..'భారతీయ న్యాయ(రెండో)సంహిత','భారతీయ నాగరిక్‌ సురక్షా (రెండో)సంహిత','భారతీయ సాక్ష్య(రెండో)'బిల్లులను మళ్లీ ప్రవేశపెట్టారు.

ట్విట్టర్ పోస్ట్ చేయండి

లోక్‌సభలో ఆమోదం పొందిన మూడు క్రిమినల్ లా బిల్లులు