Page Loader
Waqf Bill: వివాదాస్పద వక్ఫ్‌ (సవరణ) బిల్లుకు లోక్‌సభ ఆమోదం 
వివాదాస్పద వక్ఫ్‌ (సవరణ) బిల్లుకు లోక్‌సభ ఆమోదం

Waqf Bill: వివాదాస్పద వక్ఫ్‌ (సవరణ) బిల్లుకు లోక్‌సభ ఆమోదం 

వ్రాసిన వారు Sirish Praharaju
Apr 03, 2025
01:04 am

ఈ వార్తాకథనం ఏంటి

వివాదాస్పద వక్ఫ్‌ (Waqf Bill) (సవరణ) బిల్లుకు లోక్‌సభ ఆమోదం తెలిపింది. బుధవారం లోక్‌సభలో ఈ బిల్లుపై తీవ్ర స్థాయిలో చర్చ జరిగింది. 12 గంటల పాటు సాగిన ఈ సుదీర్ఘ చర్చ అనంతరం, అర్ధరాత్రి తర్వాత స్పీకర్‌ ఓం బిర్లా బిల్లుపై ఓటింగ్‌ నిర్వహించారు. మొత్తం 282 మంది సభ్యులు అనుకూలంగా ఓటు వేయగా, 232 మంది దీనిని వ్యతిరేకించారు. భాజపా నేతృత్వంలోని ఎన్డీయే కూటమి మరియు ప్రతిపక్ష ఇండియా కూటమిలోని ప్రధాన పార్టీలు తమ ఎంపీలకు విప్‌ జారీ చేసిన విషయం తెలిసిందే. గురువారం ఈ వక్ఫ్‌ బిల్లు రాజ్యసభకు వెళ్లనుంది. ఈ బిల్లుపై రాజ్యసభలో చర్చించేందుకు 8 గంటల సమయం కేటాయించారు.

ట్విట్టర్ పోస్ట్ చేయండి

వక్ఫ్‌ (సవరణ) బిల్లుకు లోక్‌సభ ఆమోదం