
లోకేశ్ కు ముందస్తు బెయిల్ మంజూరు.. ఫైబర్ గ్రిడ్ కేసు విచారణ వాయిదా
ఈ వార్తాకథనం ఏంటి
ఆంధ్రప్రదేశ్ స్కిల్ డెవలప్ మెంట్ కేసులో తెలుగుదేశం జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేశ్ కు హైకోర్టు ముందస్తు బెయిల్ మంజూరు చేసింది. ఈ మేరకు అక్టోబర్ 4 వరకు బెయిల్ శాంక్షన్ చేసింది.
అప్పటి వరకు అరెస్ట్ చేయకూడదని సీఐడీకి ఆదేశాలు జారీ చేసింది. తదుపరి విచారణను 5 తేదీకి వాయిదా వేసింది.
మరోవైపు ఫైబర్ గ్రిడ్ కేసులో దాఖలు చేసిన ముందస్తు బెయిల్ పిటిషన్ పై విచారణను కోర్టు వాయిదా వేసింది. ఇందులో భాగంగానే కేసు విచారణను అక్టోబర్ 4కు వాయిదా వేస్తున్నామని వెల్లడించింది.
మరోవైపు, ఇన్నర్ రింగ్ రోడ్డు కేసులో లోకేశ్ కు 41-ఏ సీఆర్పీసీ నోటీసులివ్వాలని సీఐడీని హైకోర్టు ఆదేశించింది.
details
స్కిల్ డెవలప్ మెంట్ కేసులో రిమాండ్ లో కొనసాగుతున్న చంద్రబాబు
ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో తెలుగుదేశం అగ్రనాయకత్వానికి న్యాయస్థానంలో చిక్కులు ఎదురవుతున్నాయి.
ఫైబర్ గ్రిడ్, స్కిల్ డెవలప్ మెంట్ కేసులు టీడీపీ అధినేత చంద్రబాబు, మాజీ మంత్రి నారా లోకేశ్ లను వెంటాడుతున్నాయి.
మరోవైపు ఏపీ ఫైబర్ గ్రిడ్,మ కేసుల్లోనూ నారా లోకేశ్ పేరును సీఐడీ చేర్చడం గమనార్హం.
ఈ మేరకు రెండు కేసుల్లోనూ నారా లోకేశ్ ముందస్తు బెయిల్ పిటిషన్లు వేశారు. వీటిని అత్యవసరంగా విచారించాలని కోర్టును కోరారు.
దీంతో విచారణ జరిపిన ఉన్నత న్యాయస్థానం స్కిల్ డెవలప్ మెంట్ కేసులో యాంటిసిపేటరీ బెయిల్ మంజూరు చేస్తూ ఉత్తర్వులు జారీ చేసింది.
ఇప్పటికే ఈ కేసులో చంద్రబాబు 21 రోజులుగా రిమాండ్ లో ఉన్నారు.