LOADING...
MPs suspended: లోక్‌సభ నుంచి మరో ముగ్గురు ఎంపీలు సస్పెండ్.. 146కు చేరిన సంఖ్య 
లోక్‌సభ నుంచి మరో ముగ్గురు ఎంపీలు సస్పెండ్

MPs suspended: లోక్‌సభ నుంచి మరో ముగ్గురు ఎంపీలు సస్పెండ్.. 146కు చేరిన సంఖ్య 

వ్రాసిన వారు TEJAVYAS BESTHA
Dec 21, 2023
06:16 pm

ఈ వార్తాకథనం ఏంటి

పార్లమెంట్ నుంచి మరో ముగ్గురు ఎంపీలు సస్పెండ్ అయ్యారు. దీంతో సస్పెండ్ అయ్యిన సభ్యుల సంఖ్య 146కి చేరింది. ఇప్పటికే 143 మంది ఎంపీలు ఉభయ సభల నుంచి బహిష్కరణ వేటుకు గురయ్యారు. తాజాగా దిగువసభ నుంచి ముగ్గురు సభ్యులు నిష్క్రమించారు.ఈ మేరకు కాంగ్రెస్ ఎంపీలు దీపక్ బైజ్,నకుల్ నాథ్,డీకే సురేశ్ గురువారం లోక్‌సభ నుంచి సస్పెండ్ అయ్యారు. డిసెంబర్ 13న పార్లమెంట్ హాల్'లో భద్రతా ఉల్లంఘనపై కేంద్ర హోంమంత్రి అమిత్ షా ప్రకటన చేయాలని డిమాండ్ చేస్తూ లోక్‌సభ,రాజ్యసభ సభ్యులు పట్టుబట్టారు. ఈ మేరకు రెండు సభల పనితీరుకు అంతరాయం కలిగించి, నినాదాలు చేసినందుకు 140 మంది ప్రతిపక్ష ఎంపీలను డిసెంబర్ 14న లోక్‌సభ స్పీకర్‌ ఓం బిర్లా సస్పెండ్ చేశారు.

ట్విట్టర్ పోస్ట్ చేయండి

పార్లమెంట్ నుంచి మరో ముగ్గురు ఔట్