LOADING...
AliExpress: అలీఎక్స్‌ప్రెస్‌లో 'డోర్‌మేట్'పై జగన్నాథుడి చిత్రం.. మండిపడుతున్న భక్తులు 
అలీఎక్స్‌ప్రెస్‌లో 'డోర్‌మేట్'పై జగన్నాథుడి చిత్రం.. మండిపడుతున్న భక్తులు

AliExpress: అలీఎక్స్‌ప్రెస్‌లో 'డోర్‌మేట్'పై జగన్నాథుడి చిత్రం.. మండిపడుతున్న భక్తులు 

వ్రాసిన వారు Sirish Praharaju
Jul 30, 2025
04:11 pm

ఈ వార్తాకథనం ఏంటి

ఒడిశాలోని పూరి జగన్నాథుడి పట్ల భక్తులు ఎంతగానో భక్తి చూపుతారు. ఆయనను ఎంతగా ఆరాధిస్తారో ప్రత్యేకంగా చెప్పనవసరం లేదు. అయితే, ఆయనే చిత్రంతో చైనా‌కు చెందిన గ్లోబల్ ఈ-కామర్స్ వెబ్‌సైట్ అలీఎక్స్‌ప్రెస్‌లో డోర్‌మ్యాట్‌ను విక్రయించడంపై తీవ్ర నిరసనలు వ్యక్తమవుతున్నాయి. జగన్నాథుని ముఖచిత్రాన్ని ముద్రించిన ఫ్లోర్‌మ్యాట్‌ను కాళ్లు తుడుచుకునే ఉత్పత్తిగా తయారు చేసి విక్రయించడంతో భక్తుల మనోభావాలు తీవ్రంగా దెబ్బతిన్నాయి. ఈ ఉత్పత్తిని మాత్రమే కాదు, దాన్ని వినియోగిస్తున్న ఫొటోను కూడా ఆ వెబ్‌సైట్‌లో ఉంచారు. దీనిపై హిందూ భక్తజనంలో ఆగ్రహం వెల్లువెత్తుతోంది.

వివరాలు 

చైనా ప్రభుత్వంతో చర్చించి అలాంటి ఉత్పత్తుల విక్రయాన్ని నిలిపేయాలి  

ఈ వ్యవహారంపై శ్రీ జగన్నాథ ఆలయ నిర్వహణ కమిటీలో ఉన్న మాజీ సభ్యుడు మాధవ్ పూజా పాండా స్పందించారు. ఈ చర్యను తీవ్రంగా ఖండించిన ఆయన, ఆలయ అధికారులు తక్షణమే ఒడిశా రాష్ట్ర ప్రభుత్వం, కేంద్ర ప్రభుత్వానికి సమాచారం అందించాలన్నారు. చైనా ప్రభుత్వంతో చర్చించి అలాంటి ఉత్పత్తుల విక్రయాన్ని నిలిపేయాలని ఆయన సూచించారు. ఇటీవలి కాలంలో జగన్నాథుడు, ఆయన సంప్రదాయానికి సంబంధించిన చిత్రాలు,పదాలకు ఇంటెలెక్చువల్ ప్రాపర్టీ రైట్స్ కల్పించాలన్న డిమాండ్లు ఎక్కువయ్యాయి. పేటెంట్లు,ట్రేడ్‌మార్కుల రూపంలో ఈ హక్కులను చక్కగా అమలు చేస్తే, భవిష్యత్తులో ఇలాంటి అవమానకర చర్యలు జరుగకుండా అడ్డుకోవచ్చని నిపుణులు అభిప్రాయపడుతున్నారు.

వివరాలు 

 ట్రెండ్ అవుతున్న #RespectJagannath, #BoycottAliExpress  హ్యాష్‌ట్యాగ్లు 

ఇక సోషల్ మీడియా వేదికగా నెటిజన్లు అలీఎక్స్‌ప్రెస్‌పై తీవ్రమైన ఆగ్రహాన్ని వ్యక్తం చేస్తున్నారు. జగన్నాథుడి చిత్రం ఉన్న డోర్‌మ్యాట్లను వెంటనే వెబ్‌సైట్ నుంచి తొలగించాలని, వాటిని విక్రయిస్తున్న వ్యక్తులు, అలీఎక్స్‌ప్రెస్ సంస్థ ప్రజలకు క్షమాపణ చెప్పాలన్న డిమాండ్లు పెరుగుతున్నాయి. #RespectJagannath, #BoycottAliExpress అనే హ్యాష్‌ట్యాగ్లు భారతదేశంలో ట్రెండ్ అవుతున్నాయి.

ట్విట్టర్ పోస్ట్ చేయండి

అలీఎక్స్‌ప్రెస్‌లో 'డోర్‌మేట్'పై జగన్నాథుడి చిత్రం..