LOADING...
Heavy rains: అల్పపీడన ప్రభావం.. నేడు తెలంగాణలో పలు జిల్లాల్లో భారీ వర్షాలు కురిసే అవకాశం
అల్పపీడన ప్రభావం.. నేడు తెలంగాణలో పలు జిల్లాల్లో భారీ వర్షాలు కురిసే అవకాశం

Heavy rains: అల్పపీడన ప్రభావం.. నేడు తెలంగాణలో పలు జిల్లాల్లో భారీ వర్షాలు కురిసే అవకాశం

వ్రాసిన వారు Jayachandra Akuri
Aug 19, 2025
10:37 am

ఈ వార్తాకథనం ఏంటి

తీవ్ర అల్పపీడన ప్రభావంతో తెలంగాణలోని పలు ప్రాంతాలు భారీ వర్షాలతో అతలాకుతలమవుతున్నాయి. వాగులు, వంకలు పొంగి పొర్లుతూ చిగురుటాకులా వణికిస్తున్నాయి. బంగాళాఖాతంలో ఏర్పడిన ఈ అల్పపీడనం మరింత బలపడి వాయుగుండంగా మారే అవకాశముందని వాతావరణ శాఖ వెల్లడించింది. ఇది దక్షిణ ఒడిశా - ఉత్తరాంధ్ర తీరాల సమీపంలో మంగళవారం వాయుగుండంగా తీరాన్ని దాటే అవకాశం ఉందని సూచించింది. ఈ ప్రభావంతో ఆదిలాబాద్, ఆసిఫాబాద్, మంచిర్యాల జిల్లాల్లో భారీ నుంచి అతి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉంది.

Details

పెరుగుతున్న వరద ప్రవాహం

అలాగే మెదక్, కామారెడ్డి, నిజామాబాద్, నిర్మల్, జయశంకర్ భూపాలపల్లి జిల్లాల్లో భారీ వర్షాలు కురుస్తాయని హెచ్చరించారు. భారీ వర్షాల కారణంగా రాష్ట్రంలోని ప్రధాన జలాశయాలకు వరద ప్రవాహం పెరుగుతోంది. నాగార్జునసాగర్ జలాశయానికి ప్రస్తుతం ఇన్‌ఫ్లో 3,70,309 క్యూసెక్కులు ఉండగా, ఔట్‌ఫ్లో 3,98,660 క్యూసెక్కులుగా ఉంది. ప్రాజెక్టు 26 గేట్లు ఎత్తి నీటిని విడుదల చేస్తున్నారు. ఇక శ్రీరాంసాగర్ ప్రాజెక్టులోకి కూడా భారీగా వరద నీరు చేరుతోంది. ప్రాజెక్టు పూర్తిస్థాయి నీటి నిల్వ సామర్థ్యం 80.5 టీఎంసీలు కాగా, ప్రస్తుతం నిల్వ 73.37 టీఎంసీలుగా ఉంది. వరద నియంత్రణ కోసం ప్రాజెక్టు 39 గేట్ల ద్వారా 2.32 లక్షల క్యూసెక్కుల నీటిని గోదావరిలోకి విడుదల చేస్తున్నారు.