Loading...
Weather Alert: ఆగ్నేయ బంగాళాఖాతంలో అల్పపీడనం.. 15 నాటికి వాయుగుండంగా మారే ఛాన్స్
ఆగ్నేయ బంగాళాఖాతంలో అల్పపీడనం.. 15 నాటికి వాయుగుండంగా మారే ఛాన్స్

Weather Alert: ఆగ్నేయ బంగాళాఖాతంలో అల్పపీడనం.. 15 నాటికి వాయుగుండంగా మారే ఛాన్స్

వ్రాసిన వారు Sirish Praharaju
Nov 13, 2026
04:55 pm

ఈ వార్తాకథనం ఏంటి

ఆగ్నేయ బంగాళాఖాతంలో అల్పపీడనం ఏర్పడింది. ఇది నవంబర్ 15 నాటికి వాయుగుండంగా బలపడే అవకాశం ఉందని భారత వాతావరణ శాఖ (ఐఎండీ) వెల్లడించింది. మధ్య అండమాన్ సముద్రం, దాని పరిసర ప్రాంతాలతో పాటు అండమాన్ నికోబార్ దీవుల మీదుగా కొనసాగుతున్న ఉపరితల ఆవర్తనం ప్రభావంతో నవంబర్ 13న ఉదయం 5.30 గంటలకు అల్పపీడనం ఏర్పడినట్లు తెలిపింది. ప్రస్తుతం ఏర్పడిన అల్పపీడనం క్రమంగా వాయవ్య దిశగా కదులుతుందని వాతావరణ నిపుణులు అంచనా వేస్తున్నారు. నవంబర్ 14 నాటికి ఇది తీవ్ర అల్పపీడనంగా మారే అవకాశం ఉంది. అనంతరం నవంబర్ 15 నాటికి అదే ప్రాంతంలో మరింత బలపడి వాయుగుండంగా రూపాంతరం చెందుతుందని ఐఎండీ పేర్కొంది.

వివరాలు 

50 నుంచి 60 కిలోమీటర్ల వేగంతో బలమైన ఈదురుగాలులు

ఈ వాతావరణ పరిస్థితుల నేపథ్యంలో బంగాళాఖాతం, అండమాన్ సముద్ర పరిసర ప్రాంతాల్లో సముద్రం అల్లకల్లోలంగా మారే సూచనలు ఉన్నాయి.

అండమాన్ సముద్రంలో నవంబర్ 13, 14 తేదీల్లో గంటకు 50 నుంచి 60 కిలోమీటర్ల వేగంతో బలమైన ఈదురుగాలులు వీచే అవకాశం ఉంది.

ఆగ్నేయ బంగాళాఖాతంలో నవంబర్ 13 నుంచి 16 వరకు ఇదే వేగంతో గాలులు వీచే ప్రమాదం ఉందని వాతావరణ శాఖ తెలిపింది.

వివరాలు 

గంటకు 65 కిలోమీటర్ల వేగంతో ఈదురుగాలులు

మరోవైపు నైరుతి బంగాళాఖాతంలో నవంబర్ 15 నుంచి 17 వరకు గాలుల తీవ్రత మరింత పెరగనుంది.

ఈ మూడు రోజుల్లో గంటకు 55 నుంచి గరిష్ఠంగా 65 కిలోమీటర్ల వేగంతో పెనుగాలులు వీచే అవకాశం ఉందని ఐఎండీ హెచ్చరించింది.

మధ్య బంగాళాఖాతంలోనూ నవంబర్ 16, 17 తేదీల్లో బలమైన ఈదురుగాలులు కొనసాగుతాయని వెల్లడించింది.

సముద్రంలో వాతావరణ పరిస్థితులు మరింత తీవ్రంగా మారే అవకాశం ఉండటంతో సంబంధిత అధికారులు పరిస్థితిని ఎప్పటికప్పుడు పర్యవేక్షిస్తున్నారు.

ADVERTISEMENT