తదుపరి వార్తా కథనం

Work Pressure: విధుల్లో ఉండగానే ప్రాణాలు కోల్పోయిన బ్యాంకు ఉద్యోగిని.. పని ఒత్తిడే కారణమన్న సహోద్యోగులు
వ్రాసిన వారు
Sirish Praharaju
Sep 25, 2024
08:58 am
ఈ వార్తాకథనం ఏంటి
పని ఒత్తిడితో 26 ఏళ్ల ఛార్టర్డ్ అకౌంటెంట్ అన్నా సెబాస్టియన్ Ernst and Young Indiaలో పనిచేస్తూ మృతిచెందడం దేశవ్యాప్తంగా చర్చనీయాంశమైంది.
ఈ ఘటన మరవకముందే ఉత్తర్‌ప్రదేశ్ లో మరో విషాదకర సంఘటన వెలుగులోకి వచ్చింది.
లక్నోలో ఒక బ్యాంకు ఉద్యోగిని విధుల్లో ఉండగానే కుప్పకూలి ప్రాణాలు కోల్పోయారు.
లక్నోలో గోమతినగర్‌లో ఉన్న హెచ్‌డీఎఫ్‌సీ బ్యాంకులో అదనపు డిప్యూటీ వైస్ ప్రెసిడెంట్‌గా పని చేస్తున్న సదాఫ్ ఫాతిమా, మంగళవారం ఎప్పటిలానే తన ఆఫీసుకు వచ్చారు.
పనిలో ఉండగా, అకస్మాత్తుగా కుర్చీలోనే కుప్పకూలారు. తోటి ఉద్యోగులు వెంటనే ఆమెను ఆసుపత్రికి తీసుకెళ్లినప్పటికీ, అప్పటికే ఆమె మరణించినట్లు వైద్యులు నిర్ధారించారు.
అనంతరం ఆమె మృతదేహాన్ని పోస్ట్‌మార్టం కోసం ఆసుపత్రికి తరలించారు.