Page Loader
ChandraBabu : చంద్రబాబు అరెస్టుపై హైకోర్టులో లంచ్ మోషన్ పిటిషన్.. సీఐడీ నిబంధనలను పాటించలేదన్న దమ్మాలపాటి శ్రీనివాస్
చంద్రబాబు అరెస్టుపై హైకోర్టులో లంచ్ మోషన్ పిటిషన్

ChandraBabu : చంద్రబాబు అరెస్టుపై హైకోర్టులో లంచ్ మోషన్ పిటిషన్.. సీఐడీ నిబంధనలను పాటించలేదన్న దమ్మాలపాటి శ్రీనివాస్

వ్రాసిన వారు Jayachandra Akuri
Sep 12, 2023
01:28 pm

ఈ వార్తాకథనం ఏంటి

స్కిల్ డెవలప్‌మెంట్ కేసులో తెలుగుదేశం అధినేత చంద్రబాబు నాయుడు ని అరెస్టు చేసిన తీరు అక్రమమని మాజీ అడ్వకేజట్ జనరల్, సీనియర్ న్యాయవాది దమ్మాలపాటి శ్రీనివాస్ పేర్కొన్నారు. దీనిపై ఆంధ్రప్రదేశ్ హైకోర్టులో శ్రీనివాస్ లంచ్ మోషన్ పిటిషన్ దాఖలు చేశారు. సీఐడీ అధికారులు నిబంధనలకు విరుద్ధంగా వ్యవహరించారని, చంద్రబాబు అరెస్టు ప్రక్రియ సరికాదని ఆయన పేర్కొన్నారు. గవర్నర్‌ అనుమతి తీసుకోకుండా ఎలా అరెస్టు చేస్తారు? అవినీతి నిరోధక చట్టం సెక్షన్‌17 ఏ ప్రకారం అనుమతి లేకుండా ఎలా అరెస్టు చేస్తారని, దీనిపై వాదనలను వినిపిస్తామని శ్రీనివాస్ పిటిషన్ లో పేర్కొన్నారు.

Details

హౌస్ కస్టడీ పిటిషన్ పై నేడు విచారణ

మరోవైపు చంద్రబాబు హౌస్ కస్టడీ పిటిషన్ పై ఏసీబీ కోర్టు విచారణ నేడు జరగనుంది. అదే విదంగా ఇన్నర్ రింగ్ రోడ్డుపై 2020లోనే చంద్రబాబుపై ఓ కేసు నమోదైంది. దీనిపై కూడా చంద్రబాబును విచారించాలని ఏపీ సీఐడీ ఏసీబీ కోర్టును కోరింది. ఈ కేసులో ఏ-1 గా చంద్రబాబు, ఏ-2గా నారాయణ, ఏ-6గా లోకేష్ పై కేసు నమోదైంది. అయితే చంద్రబాబుకు ప్రాణహాని ఉందని సిద్ధార్థ లుద్రా తెలిపారు. ఎన్‌ఎస్‌జీ భద్రత, వీవీఐపీ, 73 ఏళ్ల వయస్సు, ఆరోగ్యాన్ని పరిగణనలోకి తీసుకుని హౌస్ అరెస్ట్‌కు అనుమతి ఇవ్వాలంటూ ఆయన నిన్న వాదనలు వినిపించారు. దీనిపై మధ్యాహ్నం తీర్పు వెలువడే అవకాశం ఉంది.