
AP BJP: రాష్ట్ర బిజెపి చరిత్రలో నూతన అధ్యాయం...నూతన అధ్యకులుగా PVN మాధవ్
ఈ వార్తాకథనం ఏంటి
ఆంధ్రప్రదేశ్ బీజేపీ అధ్యక్ష పదవికి జరిగిన ఎన్నిక ఏకగ్రీవంగా ముగిసింది. పార్టీ అధిష్టానం నుంచి వచ్చిన స్పష్టమైన ఆదేశాల మేరకు మాజీ ఎమ్మెల్సీ మాధవ్ నిన్న ఐదు సెట్ల నామినేషన్ పత్రాలను దాఖలు చేసిన విషయం తెలిసిందే. అధిష్టాన సూచనలతో ఇతర ఎవరూ పోటీలో నిలవకపోవడంతో, ఈ రోజు మాధవ్ ఏకగ్రీవంగా రాష్ట్ర బీజేపీ అధ్యక్షుడిగా ఎన్నికయ్యారని ఎన్నికల ఇన్‌చార్జ్ పీసీ మోహన్ ప్రకటించారు. మాధవ్ ఎన్నికపై బీజేపీ నేతలు ఆయనకు శుభాకాంక్షలు తెలిపారు. దీంతో ఇప్పటి వరకు రాష్ట్ర అధ్యక్షురాలిగా ఉన్న పురంధేశ్వరి స్థానంలో మాధవ్ కొత్త అధ్యక్షుడిగా బాధ్యతలు చేపట్టారు.
ట్విట్టర్ పోస్ట్ చేయండి
రాష్ట్ర బిజెపి చరిత్రలో నూతన అధ్యాయం...నూతన అధ్యకులు గా శ్రీ PVN మాధవ్
రాష్ట్ర బిజెపి చరిత్రలో నూతన అధ్యాయం...నూతన అధ్యకులు గా శ్రీ PVN మాధవ్.🪷
— Anil Peddineni BJP 🚩 (@AnilPeddineni) July 1, 2025
మీ నాయకత్వంలో రాష్ట్రంలో పార్టీ మరింత బలంగా ముందుకు వెళ్లాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ శుభాభినందనలు @MadhavBJP ji#BJPNewPresident pic.twitter.com/tQZLSlQ3fG