English Hindi Tamil
    మరింత
    English Hindi Tamil
    భారతదేశం
    బిజినెస్
    అంతర్జాతీయం
    క్రీడలు
    టెక్నాలజీ
    సినిమా
    ఆటోమొబైల్స్
    లైఫ్-స్టైల్
    కథనాలు

    మమ్మల్ని అనుసరించండి
    • Facebook
    • Twitter
    • Linkedin
    హోమ్ / వార్తలు / భారతదేశం వార్తలు / మధ్యప్రదేశ్‌లో నేలరాలిన పులి పిల్ల.. బాంధవ్‌గఢ్‌ టైగర్‌ రిజర్వ్‌లో ఆడపులి మృతి 
    తదుపరి వార్తా కథనం
    మధ్యప్రదేశ్‌లో నేలరాలిన పులి పిల్ల.. బాంధవ్‌గఢ్‌ టైగర్‌ రిజర్వ్‌లో ఆడపులి మృతి 
    బాంధవ్‌గఢ్‌ టైగర్‌ రిజర్వ్‌లో ఆడపులి మృతి

    మధ్యప్రదేశ్‌లో నేలరాలిన పులి పిల్ల.. బాంధవ్‌గఢ్‌ టైగర్‌ రిజర్వ్‌లో ఆడపులి మృతి 

    వ్రాసిన వారు TEJAVYAS BESTHA
    Aug 10, 2023
    02:20 pm

    ఈ వార్తాకథనం ఏంటి

    మధ్యప్రదేశ్‌లోని పులుల సంక్షరణ కేంద్రంలో పులుల మరణాలు కొనసాగుతూనే ఉన్నాయి. తాజాగా ఆడ పులిపిల్ల మరణించింది.

    ఇప్పటికే కునో నేషనల్‌ పార్క్‌లో వరుసగా చీతాల మరణాలు కొనసాగుతున్న విషయం తెలిసిందే. దీనిపై దేశవ్యాప్తంగా ఆందోళనలు వ్యక్తం అవుతున్నాయి.

    తాజాగా బాంధవ్‌గఢ్‌ టైగర్‌ రిజర్వ్‌లో 7 నెలల వయసు గల ఆడపులి పిల్ల అనుమానాస్పదంగా మరణించింది.

    మరో పులితో జరిగిన ఘర్షణలో ఈ ఆడ పులి చనిపోయిందని అక్కడి అధికారులు భావిస్తున్నారు. ఈ మేరకు అసిస్టెంట్‌ కన్జర్వేటర్‌ ఆఫ్‌ ఫారెస్ట్‌ (ACF)ఎఫ్‌ఎస్‌ నినామా వెల్లడించారు.

    ఘటనా స్థలంలో మరో పులికి సంబంధించిన పాదముద్రలు కనిపించినట్లు పేర్కొన్నారు. దీని మరణంపై విచారణ కొనసాగుతోంది.ఇందుకోసం డాగ్ స్క్వాడ్‌ను సైతం రంగంలోకి దించినట్లు ఎఫ్‌ఎస్‌ నినామా వెల్లడించారు.

    DETAILS

    ఒక్క మధ్యప్రదేశ్‌లోనే 785 వరకు పులులు ఉన్నట్లు నివేదిక

    మరోవైపు కూనో పార్కులో దక్షిణాఫ్రికా నుంచి తెచ్చిన చీతాల్లో ఇప్పటికే 9 మరణించడం ఆందోళనకరంగా మారింది.

    జులై 29న అంతర్జాతీయ పులుల దినోత్సవాన్ని పురస్కరించుకుని నేషనల్‌ టైగర్‌ కన్జర్వేషన్‌ అథారిటీ ఓ నివేదిక రిలీజ్ చేసింది.

    ఇందులో పేర్కొన్న గణాంకాల ప్రకారం ఒక్క మధ్యప్రదేశ్‌లోనే 785 వరకు పులులున్నట్లు వివరించింది. కర్ణాటకలో 563, ఉత్తరాఖండ్‌లో 560, మహారాష్ట్రలో 444 పులులున్నట్లు నివేదించింది.

    1.కన్హా టైగర్ రిజర్వ్

    2.బాంధవ్‌గఢ్ టైగర్ రిజర్వ్

    3.పన్నా టైగర్ రిజర్వ్

    4.పెంచ్ టైగర్ రిజర్వ్

    5.సాత్పురా టైగర్ రిజర్వ్

    6.సంజయ్-దుబ్రి టైగర్ రిజర్వ్‌లు మధ్యప్రదేశ్ రాష్ట్రంలోనే ఉండటం విశేషం.

    అత్యధికంగా బాంధవ్‌గఢ్‌ లో 135 పులులు ఉన్నాయి. ఖానా రిజర్వులో 105, పెంచ్‌లో 77 చొప్పున ఉన్నట్లు వెల్లడైంది.

    మీరు పూర్తి చేశారు
    Facebook
    Whatsapp
    Twitter
    Linkedin
    సంబంధిత వార్తలు
    తాజా
    మధ్యప్రదేశ్

    తాజా

    Indira Gandhi 1971 Decision: ఇందిర గాంధీలా నాయకత్వం కావాలి.. పాక్ ఒప్పందంపై కాంగ్రెస్ విమర్శలు! కాంగ్రెస్
    Srisailam Dam: శ్రీశైలం డ్యామ్‌ వద్ద భద్రతా లోపాలు.. ప్లంజ్‌ పూల్‌ వద్ద ప్రమాద హెచ్చరికలు! శ్రీశైలం
    Attaullah Tarar : కాల్పుల ఉల్లంఘన ఆరోపణలు నిరాధారం.. పాక్‌ మంత్రి ప్రకటన పాకిస్థాన్
    Trump: ఫార్మాపై ట్రంప్ టార్గెట్‌? దిగుమతులపై పన్నుల భారమా! డొనాల్డ్ ట్రంప్

    మధ్యప్రదేశ్

    ఉజ్జయినిలో ఎయిర్ టెల్, హరిద్వార్‌లో జియో 5G సేవలు ప్రారంభించాయి టెలికాం సంస్థ
    దక్షిణాఫ్రికా నుంచి మధ్యప్రదేశ్‌కు చేరుకున్న 12 చిరుతలు సౌత్ ఆఫ్రికా
    సిధి: మధ్యప్రదేశ్‌లో ఆగి ఉన్న బస్సులను ఢీకొన్న ట్రక్కు- 14మంది దుర్మరణం రోడ్డు ప్రమాదం
    హెచ్3ఎన్2 వైరస్: మహారాష్ట్ర, దిల్లీలో హై అలర్ట్; దేశంలో 9కి చేరిన మరణాలు మహారాష్ట్ర
    మా గురించి గోప్యతా విధానం నిబంధనలు & షరతులు మమ్మల్ని సంప్రదించండి నైతిక ప్రవర్తన ఫిర్యాదుల పరిష్కారం వార్తలు న్యూస్ ఆర్కైవ్ టాపిక్స్ ఆర్కైవ్స్
    మమ్మల్ని అనుసరించండి
    Facebook Twitter Linkedin
    All rights reserved © NewsBytes 2025