Madhya Pradesh: మధ్యప్రదేశ్ సచివాలయంలో భారీ అగ్నిప్రమాదం.. కీలక పత్రాలు దగ్ధం
మధ్యప్రదేశ్ రాజధాని భోపాల్‌లోని రాష్ట్ర ప్రభుత్వం సచివాలయం వల్లభ భవన్‌లో భారీ అగ్నిప్రమాదం సంభవించింది. 1, 4, 5, 6 అంతస్తుల్లో మంటలు చెలరేగాయి. అగ్నిప్రమాదంలో పలు కీలక పత్రాలు కాలి బూడిదైనట్లు సమాచారం. పాత ఫైళ్లు అగ్నికి ఆహుతైనట్లు తెలుస్తోంది. వెంటనే అగ్నిమాపక యంత్రంగానికి సమాచారం అందించగా.. వెంటనే సిబ్బంది సంఘటనా స్థలానికి చేరుకొని మంటలను అదుపు చేస్తున్నారు. ఫైర్ సేఫ్టీ నిపుణుడు పంకజ్ ఖరే ఆధ్వర్యంలో రెస్క్యూ ఆపరేషన్ జరుగుతోంది. ముఖ్యమంత్రి సహా మంత్రుల కార్యాలయాలు కూడా వల్లభ్ భవన్‌లో ఉంటాయి. భవనంలోని ఐదో అంతస్తులో ముఖ్యమంత్రి కార్యాలయం ఉంది. ప్రస్తుతం అగ్నిప్రమాదానికి గల కారణాలు తెలియరాలేదు.