NewsBytes Telugu
    English Hindi Tamil
    మరింత
    NewsBytes Telugu
    English Hindi Tamil
    NewsBytes Telugu

    భారతదేశం బిజినెస్ అంతర్జాతీయం క్రీడలు టెక్నాలజీ సినిమా ఆటోమొబైల్స్ లైఫ్-స్టైల్ కథనాలు

    మమ్మల్ని అనుసరించండి
    • Facebook
    • Twitter
    • Linkedin
     
    హోమ్ / వార్తలు / భారతదేశం వార్తలు / మధ్యప్రదేశ్‌: భార్య, ఇద్దరు పిల్లలను గొడ్డలితో నరికి, ఇంట్లోనే పూడ్చిపెట్టాడు
    భారతదేశం

    మధ్యప్రదేశ్‌: భార్య, ఇద్దరు పిల్లలను గొడ్డలితో నరికి, ఇంట్లోనే పూడ్చిపెట్టాడు

    మధ్యప్రదేశ్‌: భార్య, ఇద్దరు పిల్లలను గొడ్డలితో నరికి, ఇంట్లోనే పూడ్చిపెట్టాడు
    వ్రాసిన వారు Naveen Stalin
    Jan 23, 2023, 03:27 pm 0 నిమి చదవండి
    మధ్యప్రదేశ్‌: భార్య, ఇద్దరు పిల్లలను గొడ్డలితో నరికి, ఇంట్లోనే పూడ్చిపెట్టాడు
    మధ్యప్రదేశ్‌లోని భార్య, ఇద్దరు పిల్లల దారుణ హత్య

    మధ్యప్రదేశ్‌లోని రత్లామ్‌లో ఘోరం జరిగింది. ఓ వ్యక్తి తన భార్యతో పాటు ఇద్దరు పిల్లలను గొడ్డలితో దారుణంగా హత్య చేశాడు. పైగా వారి మృతదేహాలను ఇంట్లోనే పూడ్చిపెట్టాడు. ఈ దారుణం జరిగిన రెండు నెలల తర్వాత విషయం వెలుగులోకి వచ్చింది. ముగ్గురిని హత్య చేసిన తర్వాత నిందితుడు ఏం జరగనట్టు అందరితో సాధారణంగా వ్యవహరించాడు. రెండు నెలలుగా అతను ఒక్కడే కనపడటం, మిగతా కుటుంబ సభ్యులు కనపడకపోవడంతో స్థానికులకు అనుమానం వచ్చి పోలీసులకు సమాచారం ఇచ్చారు. ఈ మేరకు పోలీసులు కేసు నమోదు చేసుకొని విచారించడంతో అసలు విషయం వెలుగులోకి వచ్చింది.

    కుటుంబ కలహాల కారణంగానే హత్యలు చేసినట్లు ఒప్పుకున్ననిందితులు

    భార్య, పిల్లలను ఎందుకు హత్య చేశాడో నిందితుడు సోనూ తల్వాడే చెప్పినట్లు రత్లామ్ పోలీసు సూపరింటెండెంట్ అభిషేక్ తివారీ చెప్పారు. కుటుంబ కలహాల కారణంగానే భార్యతో పాటు ఏడేళ్ల కుమారుడు, నాలుగేళ్ల కూతురిని గొడ్డలితో హత్య చేసినట్లు నిందితుడు ఒప్పుకున్నట్లు ఆయన వెల్లడించారు. విచారణ తర్వాత మరిన్ని వివరాలు చెప్తామని ఆయన పేర్కొన్నారు. మృతదేహాలు నిందితుడి భార్య, ఇద్దరు పిల్లలవేనని నిర్ధారించుకోవడానికి డీఎన్‌ఏ పరీక్షల కోసం పంపినట్లు ఎస్పీ చెప్పారు. వైద్యులు, ఫోరెన్సిక్ నిపుణుల సమక్షంలో మృతదేహాలను వెలికితీసినట్లు వెల్లడించారు. ఇదిలా ఉండగా, మృతదేహాలను ఇంట్లో పూడ్చి పెట్టడానికి నిందితుడు సోనూ తల్వాడేకు మరో వ్యక్తి సాయం చేసినట్లు పోలీసులు గుర్తించారు. దీంతో అతడిని కూడా అరెస్టు చేశారు.

    ఈ టైమ్ లైన్ ని షేర్ చేయండి
    Facebook
    Whatsapp
    Twitter
    Linkedin
    తాజా
    మధ్యప్రదేశ్

    తాజా

    ఈడీ, సీబీఐపై సుప్రీంకోర్టుకు వెళ్లిన 14రాజకీయ పార్టీలు; ఏప్రిల్ 5న విచారణ సుప్రీంకోర్టు
    మంచు మనోజ్ పోస్ట్ తో బయటపడ్డ అన్నదమ్ముల గొడవలు, స్పందించిన మోహన్ బాబు తెలుగు సినిమా
    బ్యాట్ పట్టుకున్న బ్రిటన్ ప్రధాని రిషి సునాక్.. వీడియో ఇంగ్లండ్
    One World TB Summit: 2025 నాటికి టీబీని నిర్మూలించడమే భారత్ లక్ష్యం: ప్రధాని మోదీ నరేంద్ర మోదీ

    మధ్యప్రదేశ్

    హెచ్3ఎన్2 వైరస్: మహారాష్ట్ర, దిల్లీలో హై అలర్ట్; దేశంలో 9కి చేరిన మరణాలు మహారాష్ట్ర
    సిధి: మధ్యప్రదేశ్‌లో ఆగి ఉన్న బస్సులను ఢీకొన్న ట్రక్కు- 14మంది దుర్మరణం రోడ్డు ప్రమాదం
    దక్షిణాఫ్రికా నుంచి మధ్యప్రదేశ్‌కు చేరుకున్న 12 చిరుతలు దక్షిణ ఆఫ్రికా
    ఉజ్జయినిలో ఎయిర్ టెల్, హరిద్వార్‌లో జియో 5G సేవలు ప్రారంభించాయి టెలికాం సంస్థ

    భారతదేశం వార్తలను ఇష్టపడుతున్నారా?

    అప్ డేట్ గా ఉండటానికి సబ్ స్క్రయిబ్ చేయండి.

    India Thumbnail
    మా గురించి గోప్యతా విధానం నిబంధనలు & షరతులు మమ్మల్ని సంప్రదించండి నైతిక ప్రవర్తన ఫిర్యాదుల పరిష్కారం వార్తలు న్యూస్ ఆర్కైవ్ టాపిక్స్ ఆర్కైవ్స్
    మమ్మల్ని అనుసరించండి
    Facebook Twitter Linkedin
    All rights reserved © NewsBytes 2023