Page Loader
మధ్యప్రదేశ్‌లో మంటగలిసిన మానవత్వం.. శిశువుకు పాల కోసం వెళ్తే మహిళను ఈడ్చిన యువకులు
శిశువుకు పాల కోసం వెళ్తే మహిళను ఈడ్చిన యువకులు

మధ్యప్రదేశ్‌లో మంటగలిసిన మానవత్వం.. శిశువుకు పాల కోసం వెళ్తే మహిళను ఈడ్చిన యువకులు

వ్రాసిన వారు TEJAVYAS BESTHA
Sep 01, 2023
06:14 pm

ఈ వార్తాకథనం ఏంటి

మధ్యప్రదేశ్‌లో మానవత్వం మంటగలిసింది. శిశువుకు పాల కోసం వెళ్లిన తల్లిని కొందరు యువకులు ఈడ్చికొట్టారు. ఆగస్ట్‌ 13న తెల్లవారుజామున సాగర్‌ జిల్లా కేంద్రంలోని బస్టాండ్‌ ఫుట్‌పాత్‌ వద్ద ఓ తల్లి తన బిడ్డకు గుక్కెడు పాల కోసం హోటల్ కు వెళ్లింది. అక్కడ పాలు కొన్న తర్వాత సదరు మహిళ డబ్బులివ్వడం మర్చిపోయింది.దీంతో ముగ్గురు వ్యక్తులు బాధిత తల్లిని పక్కకు ఈడ్చుకొచ్చి కాళ్లతో తంతూ కర్రతో బాదారు. ఈ క్రమంలో జనం గుమిగూడారు. ఫుట్‌పాత్‌పై నిద్రిస్తున్న శిశువును కొందరు వ్యక్తులు గమనించారు.అనంతరం అంబులెన్స్‌ను రప్పించి తల్లిబిడ్డలను ఆస్పత్రికి తరలించారు. నిందితులు ప్రవీణ్ రైక్వార్,విక్కీ యాదవ్, రాకేష్ లను పోలీసులు అరెస్ట్ చేశారు. కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నట్లు గోపాల్‌గంజ్ పోలీసులు వెల్లడించారు.

ట్విట్టర్ పోస్ట్ చేయండి

మధ్యప్రదేశ్‌లో మంటగలిసిన మానవత్వం