Page Loader
Bihar:బక్సర్ సమీపంలో పట్టాలు తప్పిన మగద్ ఎక్స్‌ప్రెస్.. రెండుగా విడిపోయిన  న్యూఢిల్లీ - పాట్నా రైలు 
బక్సర్ సమీపంలో పట్టాలు తప్పిన మగద్ ఎక్స్‌ప్రెస్.

Bihar:బక్సర్ సమీపంలో పట్టాలు తప్పిన మగద్ ఎక్స్‌ప్రెస్.. రెండుగా విడిపోయిన  న్యూఢిల్లీ - పాట్నా రైలు 

వ్రాసిన వారు Sirish Praharaju
Sep 08, 2024
04:48 pm

ఈ వార్తాకథనం ఏంటి

బిహార్ లో, బక్సర్ సమీపంలో రైలు ప్రమాదం కలకలం సృష్టించింది. దిల్లీ నుంచి ఇస్లాంపూర్‌ వైపు ప్రయాణిస్తున్న మగధ్‌ ఎక్స్‌ప్రెస్‌ రైలు, ట్వినిగంజ్‌,రఘునాథ్‌పుర్‌ రైల్వే స్టేషన్ల మధ్య రెండు భాగాలుగా విడిపోయింది. ఈ సంఘటన కారణంగా ప్రయాణికులు తీవ్ర భయాందోళనకు గురయ్యారు. ఆదివారం ఉదయం 11:08 గంటల సమయంలో ఈ ఘటన చోటుచేసుకుందని, ఎవరికీ గాయాలు కాలేదని అధికారులు వెల్లడించారు. ఆ సమయంలో వెనుక నుంచి ఏ రైలు రాకపోవడంతో పెను ప్రమాదం తప్పింది.

వివరాలు 

సంఘటన స్థలానికి చేరుకుని మరమ్మతులు చేసిన  రెస్క్యూ, సాంకేతిక బృందాలు 

ఈ ఘటనపై తూర్పు మధ్య రైల్వే సీపీఆర్వో మాట్లాడుతూ, ''దిల్లీ నుండి ఇస్లాంపూర్‌ వెళ్ళే మగధ్‌ ఎక్స్‌ప్రెస్ (20802) రైలు కోచ్‌ ఎస్‌ 6 , ఎస్‌ 7 బోగీల మధ్య కప్లింగ్‌ తెగిపోవడంతో ఈ ప్రమాదం సంభవించింది. సమాచారం అందుకున్న రెస్క్యూ, సాంకేతిక బృందాలు సంఘటన స్థలానికి చేరుకుని మరమ్మతులు చేశారు. మధ్యాహ్నం 2:25 గంటలకు రైలుకు మరమ్మతులు పూర్తి కావడంతో అది ప్రయాణం ప్రారంభించింది. ఆ తర్వాత మిగతా రైళ్లనూ అనుమతించాం. ఈ ప్రమాదం కారణంగా రైళ్ల రాకపోకలకు మూడు గంటల పాటు అంతరాయం ఏర్పడింది. ప్రమాదానికి అసలు కారణాల కోసం దర్యాప్తును ఆదేశించాం'' అని తెలిపారు.

వివరాలు 

పశ్చిమ బెంగాల్ రైల్వే స్టేషన్‌లో అగ్నిప్రమాదం 

ఇదిలా ఉండగా, పశ్చిమ బెంగాల్‌లోని దక్షిణ 24 పరగణాల జిల్లాలో ఘుతియారీ షరీఫ్ రైల్వే స్టేషన్లో అగ్నిప్రమాదం చోటుచేసుకుంది. ఆదివారం ఉదయం 10:30 గంటల సమయంలో ఒకటో నంబర్‌ ప్లాట్‌ఫాంపైన ఓ దుకాణంలో మంటలు చెలరేగాయి, తద్వారా ఇతర స్టాళ్లకు వ్యాపించాయి. ఫ్లాట్‌ఫాంలో రైళ్ల కోసం వేచి చూస్తున్న ప్రయాణికులు భయంతో అరవడం ప్రారంభించారు. ఘటనా స్థలానికి చేరుకున్న రైల్వే పోలీసులు, అగ్నిమాపక సిబ్బంది మంటలను అదుపు చేశారు.