Earthquake: పశ్చిమ టర్కీలో 6.1 తీవ్రతతో భూకంపం.. 20 మందికి పైగా గాయాలు
ఈ వార్తాకథనం ఏంటి
పశ్చిమ టర్కీ ప్రాంతంలో మంగళవారం ఉదయం శక్తివంతమైన భూకంపం సంభవించింది. ఈ భూకంపం తీవ్రత రిక్టర్ స్కేల్‌పై 6.1గా నమోదైంది. ఇస్తాంబుల్, బుర్సా, మనీసా, ఇజ్మీర్ ప్రావిన్సుల్లో ప్రకంపనలు స్పష్టంగా అనుభూతి అయ్యాయి. భూకంప ధాటికి పలు భవనాలు దెబ్బతిన్నాయి,వాటిలో మూడు భవనాలు పూర్తిగా కూలిపోయాయని అధికారులు వెల్లడించారు. అయితే ఇప్పటివరకు ప్రాణనష్టంపై ఎటువంటి అధికారిక సమాచారం లభించలేదని తెలిపారు. విపత్తు,అత్యవసర నిర్వహణ సంస్థ (AFAD) ప్రకారం,భూకంప కేంద్రం బలికేసిర్ ప్రావిన్స్‌లోని సిందిర్గి పట్టణం వద్ద ఉందని, అది సుమారు 3.72 మైళ్ల లోతులో సంభవించిందని పేర్కొన్నారు. అంతర్గత వ్యవహారాల మంత్రి అలీ యెర్లికాయ తెలిపారు.సిందిర్గి ప్రాంతంలో మూడు ఖాళీ భవనాలు, అలాగే రెండు అంతస్తుల వ్యాపార సముదాయం కూలిపోయాయి.
వివరాలు
అత్యంత భయానక విపత్తులలో ఒకటి
ఈ నిర్మాణాలు గతంలో సంభవించిన భూకంపం వల్ల ఇప్పటికే బలహీనపడ్డాయని,తాజా ప్రకంపనలతో పూర్తిగా కూలిపోయాయని చెప్పారు. బలికేసిర్ గవర్నర్ ఇస్మాయిల్ ఉస్తావోగ్లు ప్రకారం,ఈ భూకంపం కారణంగా 22మంది గాయపడినట్లు నివేదికలు అందాయి. వీరిలో చాలామంది భయంతో పరుగులు తీస్తుండగా గాయపడినట్లు తెలిపారు. అయితే ఇప్పటివరకు ఎవరూ మరణించారని సమాచారం లేదని స్పష్టం చేశారు. టర్కీ భూకంప ప్రభావిత ప్రాంతంగా ప్రసిద్ధి చెందింది. 2023లో ఆ దేశం ఎదుర్కొన్న 7.8తీవ్రత గల భూకంపంలో 53,000మందికి పైగా ప్రాణాలు కోల్పోయారు. ఆ విపత్తులో దక్షిణ,ఆగ్నేయ ప్రావిన్సుల్లో లక్షలాది భవనాలు కూలిపోయాయి. అంతేకాదు,పొరుగున ఉన్న సిరియా ఉత్తర ప్రాంతాల్లో మరో 6,000 మంది మరణించారు,ఇది ఆ ప్రాంత చరిత్రలో అత్యంత భయానక విపత్తులలో ఒకటిగా గుర్తింపు పొందింది.