Congress: మహారాష్ట్ర, ఝార్ఖండ్ ఎన్నికలు.. తెలంగాణ కాంగ్రెస్ నేతలకు కీలక బాధ్యతలు
మహారాష్ట్ర, ఝార్ఖండ్ ఎన్నికల కోసం కాంగ్రెస్ పార్టీ సీనియర్ పరిశీలకులను నియమించినట్లు ఏఐసీసీ ఉత్తర్వులు విడుదల చేసింది. ఈ నియామకాల్లో తెలంగాణ నుంచి ముగ్గురు నేతలు ఎంపిక కావడం విశేషం. మహారాష్ట్రలోని 5 డివిజన్లకు 11 మంది పరిశీలకులను నియమించింది. వారిలో రాష్ట్ర మంత్రులు ఉత్తమ్‌కుమార్ రెడ్డి, సీతక్క పేర్లు ఉన్నాయి. ఝార్ఖండ్ రాష్ట్రానికి తెలంగాణ డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్కతో పాటు, కాంగ్రెస్ సీనియర్ నేతలు తారిక్ అన్వర్, అధిర్ రంజన్ చౌదరి నియమితులయ్యారు. కేంద్ర ఎన్నికల సంఘం ఇవాళ ఎన్నికల షెడ్యూల్‌ను ప్రకటించనుంది. ఈ నేపథ్యంలో ఎయిసీసీ పరిశీలకుల నియామకం జరిగింది.
పరిశీలకులుగా తెలంగాణ నేతలు
మరాట్వాడా డివిజన్ కు సచిన్ పైలట్, ఉత్తమ్ కుమార్ రెడ్డి ఉత్తర మహారాష్ట్ర డివిజన్‌కు సీతక్క, డాక్టర్ నసీర్ హుస్సేన్ ముంబయి, కొంకన్, విదర్బా, పశ్చిమ మహారాష్ట్ర డివిజన్లకు సీనియర్ నేతలు ముకుల్ వాస్నిక్, అవినాశ్ పాండే