Page Loader
ఈదురు గాలులకు కూలిన భారీ చెట్టు; ఏడుగురు మృతి
మహారాష్ట్ర: అకోలాలో ఈదురు గాలులకు కూలిన భారీ చెట్టు; ఏడుగురు మృతి

ఈదురు గాలులకు కూలిన భారీ చెట్టు; ఏడుగురు మృతి

వ్రాసిన వారు Stalin
Apr 10, 2023
09:33 am

ఈ వార్తాకథనం ఏంటి

మహారాష్ట్రలోని అకోలాలో ఓ టిన్‌షెడ్‌పై భారీ చెట్టు కూలడంతో ఏడుగురు మృతి చెందగా, ఐదుగురు గాయపడ్డారు. ఈ సంఘటన ఆదివారం సాయంత్రం 7 గంటల సమయంలో జరిగింది. వర్షం, బలమైన గాలుల కారణంగా ఆలయ ముందు ఉన్న భారీ వేప చెట్టు ఒక టిన్ షెడ్‌పై కుప్పకూలిపోయింది. ఆ చెట్టు కూలే సమయంలో దాని కింద 35 నుంచి 40 మంది వరకు ఉన్నట్లు పోలీసులు తెలిపారు. ఈ ప్రమాదంలో మరో ఐదుగురు గాయపడినట్లు వెల్లడించారు. వారిని వెంటనే అకోలా మెడికల్ కాలేజీకి తరలించినట్లు పేర్కొన్నారు.

మహారాష్ట్ర

మృతుల కుటుంబాలకు ఆర్థికసాయం ప్రకటించిన ప్రభుత్వం

ప్రమాదం జరిగిన సమాచారం అందుకున్న అధికారులు వెంటనే సహాయక చర్యలు చేపట్టారు. జేసీబీ యంత్రాలను తెప్పించి చెట్టు కొమ్మను, కూలిన షెడ్డును పైకి లేపారు. మహారాష్ట్ర ఉపముఖ్యమంత్రి దేవేంద్ర ఫడ్నవీస్ మరణించిన వారి పట్ల తీవ్ర దిగ్భ్రాంతిని వ్యక్తం చేశారు. మరణించిన వారి కుటుంబాలకు ఆర్థిక సహాయం చేస్తామని ఏక్‌నాథ్ షిండే నేతృత్వంలోని మహారాష్ట్ర ప్రభుత్వం ప్రకటించింది.