Earthquake: మహారాష్ట్రలో భారీ భూకంపం.. తెలంగాణ, కర్ణాటకలో ప్రకంపనలు
మహారాష్ట్రలో సోమవారం తెల్లవారుజామున బలమైన భూకంపం సంభవించింది. నేషనల్ సెంటర్ ఫర్ సిస్మోలజీ ప్రకారం.. రిక్టర్ స్కులుపై 3.5 తీవ్రత నమోదైంది. అయితే భూకంపం కారణంగా ఎలాంటి ప్రాణ, ఆస్తి నష్టం జరిగినట్లు ఇంకా సమాచారం అందలేదు. భూకంపం ఉదయం 5.09 గంటలకు సంభవించిందని, భూకంప కేంద్రం మహారాష్ట్రలోని హింగోలి జిల్లాలో ఉన్నట్లు నేషనల్ సెంటర్ ఫర్ సిస్మోలజీ వెల్లడించింది. మహారాష్ట్రలో వచ్చిన భూకంపం కారణంగా తెలంగాణ, కర్ణాటక రాష్ట్రాల్లోనూ ప్రకంపనలు రావడం గమనార్హం. భూకంపానికి కేంద్ర బిందువైన హింగోలి జిల్లా తూర్పు మహారాష్ట్రలో ఉంది. ఇది తెలంగాణ రాజధాని హైదరాబాద్‌కు 255 కిలోమీటర్ల దూరంలో, నాగ్‌పూర్‌కు 265 కిలోమీటర్ల దూరంలో ఉంది.