Page Loader
Mahua Moitra : మహువా మోయిత్రాకు షాక్.. నివేదికను ఆమోదించిన ఎథిక్స్ ప్యానెల్ కమిటీ
Mahua Moitra: మహువా మోయిత్రాకు షాక్.. నివేదికను ఆమోదించిన ఎథిక్స్ ప్యానెల్ కమిటీ

Mahua Moitra : మహువా మోయిత్రాకు షాక్.. నివేదికను ఆమోదించిన ఎథిక్స్ ప్యానెల్ కమిటీ

వ్రాసిన వారు TEJAVYAS BESTHA
Nov 09, 2023
05:45 pm

ఈ వార్తాకథనం ఏంటి

టీఎంసీ లోక్‌సభ ఎంపీ మహువా మోయిత్రాకు పార్లమెంటరీ ఎథిక్స్ కమిటీ షాక్ ఇచ్చింది. ఈ మేరకు ఆమెపై తయారు చేసిన నివేదిక ఆమోదం పొందింది. నివేదికను ఆరుగురు సభ్యులు సమర్థించగా, నలుగురు వ్యతిరేకించారని కమిటీ చీఫ్ వినోద్ సోంకర్ తెలిపారు.దీంతో 6:4 బలంతో నివేదిక ఆమోదం పొందిందన్నారు. తృణమూల్ కాంగ్రెస్ ఎంపీ మోయిత్రాపై'క్యాష్ ఫర్ క్వెరీ' ఆరోపణలపై పార్లమెంటరీ ఎథిక్స్ కమిటీ గురువారం నివేదకను ఆమోదించింది. ఇదే సమయంలో నివేదికను ఆమోదించడాన్ని ప్యానెల్‌లోని సభ్యులు అపరాజిత సారంగి, రాజ్‌దీప్ రాయ్, సుమేధానంద్ సరస్వతి, ప్రణీత్ కౌర్, వినోద్ సోంకర్, హేమంత్ గాడ్సే సమర్థించారు. డానిష్ అలీ, వి వైతిలింగం, పిఆర్ నటరాజన్, గిరిధారి యాదవ్, జేపీ ఎంపీ వినోద్ కుమార్ నివేదికను వ్యతిరేకించారు.

ట్విట్టర్ పోస్ట్ చేయండి

తప్పు చేయని వారెవరూ మోయిత్రాను సమర్థించరన్న కాంగ్రెస్ ఎంపీ అపరాజిత

ట్విట్టర్ పోస్ట్ చేయండి

నివేదిక ఆమోదం పొందిందన్న ఎథిక్స్ కమిటీ చీఫ్ సోంకర్