పీఎంఓ హీరానందని సంతకం చేయమని బలవంతం చేసింది: మహువా మోయిత్రా
తృణమూల్ కాంగ్రెస్ ఎంపీ మహువా మోయిత్రా మీడియాలో బహిర్గతమైన వ్యాపారవేత్త దర్శన్ హీరానందానీ అఫిడవిట్ వ్యవహారంపై సంచలన వ్యాఖ్యలు చేశారు. ప్రధానమంత్రి కార్యాలయం తెల్లకాగితం పై దర్శన్ ను సంతకం చేయించి మీడియాకు లీక్ చేశారని ఆరోపించారు. పార్లమెంటు ఎథిక్స్ కమిటీ ముందు సమర్పించిన దర్శన్ హీరానందని అఫిడవిట్ విశ్వసనీయతపై మహువా మోయిత్రా అనుమానం వ్యక్తం చేశారు. అఫిడవిట్ లెటర్ హెడ్ లేని తెల్ల కాగితంపై ఉందని,దానిని అధికారికంగా విడుదల చెయ్యలేదని అన్నారు. లీక్ కాకుండా అధికారిక మూలం లేదు" అని మహువా చెప్పారు. వ్యాపారవేత్త హీరానందనికి PMO అలాగే మంత్రులందరినీ కి నేరుగా కలిసే యాక్సెస్ ఉన్నప్పుడు మొదటిసారి ప్రతిపక్ష ఎంపినైనా నాకు లంచం ఎందుకు ఇస్తారు? ఇది పూర్తిగా అవాస్తవమన్నారు.
అదానీ విషయంలో బీజేపీ ప్రభుత్వంపై మోయిత్రా ఆరోపణలు
ఈ లేఖ PMO రాసిందే కానీ దర్శన్ కాదన్నారు. దర్శన్ తండ్రిని పీఎంఓ బెదిరించి లేఖపై సంతకం చేయడానికి 20 నిమిషాల సమయం ఇచ్చిందని, అంతేకాకుండా వారి వ్యాపారాలన్నింటినీ పూర్తిగా మూసివేస్తామని వారిని బెదిరించారని మోయిత్రా ఆరోపించారు. అదానీ విషయంలో ఎలాగైనా తన నోరు మూయించాలని బీజేపీ ప్రభుత్వం ఎదురుచూస్తోందని మహువా మోయిత్రా ఆరోపించారు. అఫిడవిట్‌లోని విషయాలను హాస్యాస్పదంగా పేర్కొంటూ బిజెపి ఐటి సెల్‌లో మంచి సృజనాత్మక రచన నైపుణ్యం కలిగిన కొంతమంది మంద బుద్ధి గలవారితో ఈ లేఖ రాయించినట్లు స్పష్టం అవుతోందని దుయ్యబట్టారు. దర్శన్ హీరానందాని నిజాయితీగా తనపై ఆరోపణలు చేస్తే అతను విలేకరుల సమావేశం నిర్వహించవచ్చు కానీ ఇలా ఛానల్ కు లీక్ చెయ్యరని మహువా మోయిత్రా అన్నారు.