
Yadadri Power Plant: యాదాద్రి పవర్ ప్లాంట్‌లో భారీ అగ్నిప్రమాదం
ఈ వార్తాకథనం ఏంటి
యాదాద్రి పవర్ ప్లాంట్‌లో భారీ అగ్నిప్రమాదం చోటు చేసుకోవడంతో 600 మెగావాట్ల విద్యుత్ ఉత్పత్తి నిలిచిపోయింది.
సోమవారం తెల్లవారుజామున ఒంటి గంట సమయంలో ప్లాంట్ తొలి యూనిట్‌లోని బాయిలర్ నుంచి ఆయిల్ లీకవడంతో అదే సమయంలో కింద వెల్డింగ్ చేస్తుండగా మంటలు చెలరేగాయి.
క్రమంగా ఆ మంటలు యూనిట్ మొత్తం వ్యాపించాయి, దీంతో పెద్ద ఎత్తున అగ్ని కీలలు ఎగసిపడ్డాయి. అగ్నిమాపక సిబ్బంది ఘటనా స్థలానికి చేరుకుని సకాలంలో మంటలను ఆర్పి పెను ప్రమాదాన్ని అడ్డుకున్నారు.
ఈ ప్రమాదంలో 600 మెగావాట్ల విద్యుత్ ఉత్పత్తి నిలిచిపోయింది.
Details
ఆరుగురు కార్మికులకు గాయాలు
ట్రయల్ రన్ కోసం సిద్ధమవుతున్న సమయంలో ఈ ప్రమాదం చోటుచేసుకోవడం గమనార్హం. గత ఫిబ్రవరి 14న కూడా యాదాద్రి పవర్ ప్లాంట్‌లో మరో ప్రమాదం జరిగింది.
ఆ సమయంలో యాష్ ప్లాంట్ ఈఎస్‌పీ వద్ద కాలిన బూడిద పడటంతో ఆరుగురు కార్మికులు తీవ్రంగా గాయపడ్డారు.
ప్లాంట్‌లోని రెండో యూనిట్ నుండి 800 మెగావాట్ల విద్యుత్ ఉత్పత్తి జరుగుతున్న సమయంలో యాష్ జామ్ కావడంతో ట్రిప్ అయ్యి బాయిలర్ నిలిచిపోయింది.
జామ్ అయిన యాష్‌ను తొలగిస్తున్న క్రమంలో వేడి బూడిదకి కాంతి పడిన కొద్దీ ఆరుగురు కార్మికులు తీవ్రంగా గాయపడ్డారు.