Ajay Misra : TASA నూతన కమాండర్‌గా మేజర్ జనరల్ అజయ్ మిశ్రా
తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ సబ్ ఏరియా జనరల్ ఆఫీసర్ కమాండింగ్‌గా మేజర్ జనరల్ అజయ్ మిశ్రా సికింద్రాబాద్‌లో బాధ్యతలు స్వీకరించారు. 1992లో ఆర్టిలరీ రెజిమెంట్‌లో తన సైనిక జీవితం ప్రారంభించిన అజయ్ మిశ్రా, ఖడక్‌వాస్లాలో నేషనల్ డిఫెన్స్ అకాడమి, డెహ్రాడూన్‌లో ఇండియన్ మిలిటరీ అకాడమి వంటి ప్రతిష్ఠాత్మక సంస్థల్లో శిక్షణ పొందిన అనుభవం ఉంది. అజయ్ మిశ్రా డిఫెన్స్ సర్వీస్ స్టాఫ్ కాలేజీ (వెల్లింగ్టన్)లో గ్రాడ్యుయేషన్ పూర్తి చేయడంతో పాటు ఆర్మీ వార్ కాలేజీ నుంచి హయ్యర్ కమాండ్ కోర్స్ కూడా పూర్తి చేశారు. న్యూదిల్లీలోని నేషనల్ డిఫెన్స్ కాలేజీలో ప్రతిష్ఠాత్మక కోర్సు పూర్తి చేసి, త్రివిధ దళాల్లో విశేష అనుభవాన్ని సంపాదించారు.
TASA అభివృద్ధికి కృషి: అజయ్ మిశ్రా
ఉత్తర సరిహద్దుల వద్ద తన రెజిమెంట్, బ్రిగేడ్‌ను కమాండ్ చేయడంలో ఆయనకు ప్రావీణ్యం ఉంది. సైన్యంలో అందించిన విశేష సేవలకు గుర్తుగా ఆయనకు రెండు సార్లు చీఫ్ ఆఫ్ ఆర్మీ స్టాఫ్ కమెండేషన్ కార్డు లభించింది. బాధ్యతలు స్వీకరించిన అనంతరం అజయ్ మిశ్రా మాట్లాడారు. ఈ బాధ్యతలను సమర్థంగా నిర్వహించి, TASA అభివృద్ధికి తన వంతు కృషి చేస్తానని తెలిపారు.