Page Loader
Mamata Banerjee: మమతా బెనర్జీ, అభిషేక్ బెనర్జీ మధ్య భగ్గుమంటున్న విభేదాలు 
మమతా బెనర్జీ, అభిషేక్ బెనర్జీ మధ్య భగ్గుమంటున్న విభేదాలు

Mamata Banerjee: మమతా బెనర్జీ, అభిషేక్ బెనర్జీ మధ్య భగ్గుమంటున్న విభేదాలు 

వ్రాసిన వారు Jayachandra Akuri
Aug 22, 2024
11:22 am

ఈ వార్తాకథనం ఏంటి

కోల్‌కతా ఆర్జీకార్ వైద్య కళాశాలలో పశ్చిమబెంగాల్ ముఖ్యమంత్రి మమతా బెనర్జీతో, ఆమె మేనల్లుడు అభిషేక్ బెనర్జీ మద్య విభేదాలు ఉన్నట్లు జోరుగా ప్రచారం సాగుతోంది. బాధితురాలికి న్యాయం చేయాలంటూ సీఎం చేస్తున్న ర్యాలీలకు అభిషేక్ బెనర్జీ దూరంగా ఉండటంతో ఈ వార్తలకు బలం చేకూరుతోంది. ముఖ్యంగా ఆర్జీకాల్ మాజీ ప్రిన్సిపల్ సందీప్ ఘోష్‌‌ను సస్పెండ్ చేయడం, అపై కోల్‌కతా నేషనల్ మెడికల్ కాలేజీలో అతడికి పోస్టింగ్ ఇవ్వడంతో అభిషేక్ అసంతృప్తిలో ఉన్నట్లు సమాచారం.

Details

 మమతా బెనర్జీతో అభిప్రాయ భేదాలు 

మమతా బెనర్జీ ఆర్జీకార్ మెడికల్ కాలేజీ విషయంలో మాత్రం కఠిన చర్యలు తీసుకోలేదని అభిషేక్ బెనర్జీ అభిప్రాయపడుతున్నట్లు సమాచారం. పార్టీ ఇమేజ్‌ని కాపాడుకోవాలంటే కోల్‌కతా అత్యాచార ఘటనపై కఠిన వైఖరి అనుసరించాలని అభిషేక్ కోరినట్లు తెలిసింది. ఇక సుప్రీంలో విచారణ జరుగుతున్న సమయంలోనూ మమతానే నేరుగా మీడియాతో సంబంధాలను పర్యవేక్షించారు. ఇక అభిషేక్‌ బెనర్జీ మీడియా బృందాన్ని ఆమె పక్కనపెట్టడంతోనే విభేదాలు వచ్చినట్లు తెలిసింది.