
Pune Rape Case: పుణె అత్యాచార ఘటన నిందితుడి అరెస్టు
ఈ వార్తాకథనం ఏంటి
మహారాష్ట్రలోని పుణేలో పార్కింగ్ చేసిన బస్సులో ఓ యువతిపై జరిగిన అత్యాచార ఘటన ప్రజల్లో తీవ్ర ఆగ్రహాన్ని రేపింది.
తాజాగా, ఈ కేసులో నిందితుడు రామ్‌దాస్ (36)ను పోలీసులు అరెస్టు చేశారు.
అధికారుల వెల్లడించిన వివరాల ప్రకారం, శ్రీరూర్‌లోని చెరుకు తోటలో రామ్‌దాస్ దాక్కున్నట్లు సమాచారం అందడంతో, పోలీసులు డ్రోన్లు, జాగిలాలను ఉపయోగించి గాలింపు చేపట్టారు.
నిందితుడి ఫోటోను విడుదల చేసి, అతని ఆచూకీ తెలిపిన వారికి రూ.1 లక్ష రివార్డు ప్రకటించారు.
ఈ క్రమంలో గురువారం అర్ధరాత్రి నిందితుడికి ఆకలేసి ఒక ఇంటికి వెళ్లగా, ఆ ఇంట్లో ఉన్న వ్యక్తి అతన్ని గుర్తించి పోలీసులకు సమాచారమిచ్చారు. వెంటనే అక్కడికి చేరుకున్న అధికారులు రామ్‌దాస్‌ను అరెస్టు చేశారు.
వివరాలు
ఘటన వివరాలు:
స్వర్‌గేట్ బస్‌స్టేషన్ మహారాష్ట్రలో అత్యంత రద్దీగా ఉండే ప్రాంతాల్లో ఒకటి.మంగళవారం ఉదయం 6 గంటల సమయంలో ఈ ఘోరం చోటుచేసుకుంది.
పోలీసుల వివరాల ప్రకారం,తన స్వగ్రామానికి వెళ్లేందుకు బస్‌స్టేషన్‌కు చేరుకున్న యువతితో నిందితుడు మాటలు కలిపాడు "అక్కా" అని సంబోధిస్తూ నమ్మకాన్ని పెంచాడు.గ్రామానికి వెళ్లే బస్సు మరోచోట ఉందని చెప్పి,బస్‌స్టేషన్‌లోనే ఒంటరిగా ఉన్న మహారాష్ట్ర రోడ్డు రవాణా సంస్థకు చెందిన బస్సు దగ్గరకు తీసుకెళ్లాడు.
బస్సులోకి వెళ్లేందుకు యువతి సందేహించగా,లోపల ప్రయాణికులు ఉన్నారని,వాళ్లు నిద్రలో ఉండటంతో లైట్లు వేసుకోలేదని నమ్మించాడు.
యువతి లోపలికి వెళ్లగానే తలుపు మూసి అత్యాచారానికి పాల్పడ్డాడు.
వివరాలు
పోలీసుల విచారణ
సీసీటీవీ ఫుటేజీ ఆధారంగా నిందితుడిని దత్తాత్రేయ రామ్‌దాస్‌గా గుర్తించారు.
అతనిపై ఇప్పటికే పలు కేసులు ఉన్నాయని, 2019 నుంచి బెయిల్‌పై బయట ఉన్నాడని పోలీసులు తెలిపారు.
ఈ కేసును అధిక ప్రాధాన్యతనిచ్చిన అధికారులు, నిందితుడిని పట్టుకోవడానికి 13 ప్రత్యేక బృందాలను ఏర్పాటు చేశారు.
వీటిలో ఎనిమిది క్రైమ్ బ్రాంచ్ బృందాలు ఉన్నాయి. అత్యాచారం జరిగిన ప్రాంతానికి కేవలం 100 మీటర్ల దూరంలోనే పోలీస్ స్టేషన్ ఉండడం గమనార్హం.