
బిహార్లో దారుణం.. ఆస్పత్రిలో రోగిపై తుపాకీ కాల్పులు
ఈ వార్తాకథనం ఏంటి
బిహార్ రాష్ట్రంలో దారుణం చోటు చేసుకుంది. ఆస్పత్రిలోకి చొరబడిన ఓ ఆగంతకుడు రోగిపై ఘోరంగా కాల్పులు జరిపిన ఘటన ఆర్రాహ్ పట్టణంలో జరిగింది.
అనారోగ్యం కారణాలతో పట్టణంలోని ఆస్పత్రిలో ఓ వ్యక్తి చేరాడు. గురువారం రాత్రి 7 గంటల సమయంలో మరో వ్యక్తి (దుండగుడు)ఆస్పత్రిలోకి చొరబడ్డాడు.
అనంతరం ఒక్కసారిగా సదరు రోగిపై కాల్పులకు తెగబడ్డాడు. గమనించిన పక్కనున్న వారు తేరుకుని నిందితుడ్ని పట్టుకునేలోగా పారిపోయాడు.
మరోవైపు బుల్లెట్ గాయానికి గురైన బాధితుడికి వైద్యులు హుటాహుటిన చికిత్స అందించారు. ఈ మేరకు ఘటనపై ఆస్పత్రి సిబ్బంది పోలీసులకు ఫిర్యాదు చేశారు.
కేసు నమోదు చేసుకున్న పోలీసులు, నిందితుడి కోసం గాలిస్తున్నారు. ఈ నేపథ్యంలోనే ఆస్పత్రిలోని సీసీ కెమెరాల ద్వారా నిందితుడ్ని గుర్తించేందుకు ప్రయత్నిస్తున్నారు.
ట్విట్టర్ పోస్ట్ చేయండి
బిహార్లో దారుణం.. రోగిపై తుపాకీ కాల్పులు
#WATCH | A person was shot by an unknown assailant inside a hospital in Bihar's Arrah yesterday
— ANI (@ANI) September 1, 2023
Sub-Inspector Anil Singh says, "The injured is being treated. Further investigation is being done."
(CCTV visuals source: Hospital) pic.twitter.com/Jc3xBiLJ8r