Page Loader
Karnataka: కర్ణాటకలో పెను విషాదం.. సోదరి ఇంటికి వెళ్తుండగా.. 
Karnataka: కర్ణాటకలో పెను విషాదం.. సోదరి ఇంటికి వెళ్తుండగా..

Karnataka: కర్ణాటకలో పెను విషాదం.. సోదరి ఇంటికి వెళ్తుండగా.. 

వ్రాసిన వారు Sirish Praharaju
Apr 25, 2024
09:12 am

ఈ వార్తాకథనం ఏంటి

హార్ట్ ఎటాక్ లేదా మరే కారణంతోనో సడన్ గా మృతి చెందుతున్న వారి సంఖ్య రోజురోజుకు పెరుగుతూనే ఉంది. ఉన్నట్టుండి కుప్పకూలి, ప్రాణాలు కోల్పోతున్నారు. ఇలాంటి ఘటనే కర్ణాటకలో చోటుచేసుకుంది. బస్సులో ప్రయాణిస్తున్నఓ వ్యక్తి గుండెపోటుతో మరణించారు. బస్సులో ప్రయాణిస్తున్నఆయనకు అకస్మాత్తుగా గుండెపోటు వచ్చింది. వెంటనే సమీప ఆసుపత్రికి తరలించగా చికిత్స పొందుతూ మృతి చెందాడు. కలబురగి జిల్లా కమ్లాపూర్‌కి చెందిన విజయకుమార్ శివశరణప్ప(45) నాగనహళ్లి నివాసి.

Details 

కూర్చున్న సీటులోనే కుప్పకూలిపోయాడు

కలబురగి నుంచి భాల్కీలోని తన సోదరి ఇంటికి వెళ్తున్నాడు. బస్సులో ఉన్నశివశరణప్పకి ఛాతీ నొప్పి రావడంతో కూర్చున్న సీటులోనే కుప్పకూలిపోయాడు. బస్సులో ప్రయాణికులు వెంటనే బస్సును నిలిపేసి అతడిని స్పృహలోకి తీసుకురావడానికి ప్రయత్నించారు. అతనికి స్పృహ రాకపోవడంతో బస్సును నేరుగా సమీపంలోని ఆసుపత్రికి తరలించారు. అప్పటికే విజయ్‌కుమార్‌ గుండెపోటుతో మృతి చెందినట్లు వైద్యులు తెలిపారు.