తదుపరి వార్తా కథనం

MANAIR VAGU: మానేరు వాగుపై కూలిన నిర్మాణంలో ఉన్న వంతెన
వ్రాసిన వారు
Sirish Praharaju
Apr 23, 2024
09:40 am
ఈ వార్తాకథనం ఏంటి
పెద్దపల్లి జిల్లా ఓడేడు నుంచి జయశంకర్ భూపాలపల్లి జిల్లా గర్మిళ్లపల్లి మధ్య దూరం తగ్గించేందుకు మానేరు వాగుపై నిర్మిస్తున్నవంతెన కూలిపోయింది.
ముత్తారం మండలం ఓడేడు పరిధిలో సోమవారం అర్ధరాత్రి ఈ ఘటన చోటుచేసుకుంది. 2016లో ఈ వంతెన పనులు ప్రారంభమయ్యాయి.
మధ్యలో కాంట్రాక్టర్లు మారడం, ఫండ్స్ లేకపోవడం లాంటి కారణాలతో నిర్మాణం ఆలస్యమవుతూ వస్తోంది.
అక్కడ ఏర్పాటు చేసిన తాత్కాలిక మార్గంలో స్థానికులు రాకపోకలు సాగిస్తున్నారు.
అర్ధరాత్రి సమయంలో వంతెన కూలడంతో పెను ప్రమాదం తప్పింది.