Loading...
Andhra Pradesh: ఏపీలో రూ.36 కోట్ల పెట్టుబడి.. ప్రభుత్వంతో మంచు మనోజ్ దంపతుల ఒప్పందం
ఏపీలో రూ.36 కోట్ల పెట్టుబడి.. ప్రభుత్వంతో మంచు మనోజ్ దంపతుల ఒప్పందం

Andhra Pradesh: ఏపీలో రూ.36 కోట్ల పెట్టుబడి.. ప్రభుత్వంతో మంచు మనోజ్ దంపతుల ఒప్పందం

వ్రాసిన వారు Sirish Praharaju
Nov 13, 2026
08:57 am

ఈ వార్తాకథనం ఏంటి

ఆంధ్రప్రదేశ్‌లో రూ.36 కోట్ల పెట్టుబడితో పరిశ్రమను ఏర్పాటు చేసేందుకు సినీ నటుడు మంచు మనోజ్, ఆయన భార్య భూమా మౌనిక రెడ్డి స్థాపించిన 'నమస్తే వరల్డ్' స్టార్టప్ రాష్ట్ర ప్రభుత్వంతో ఒప్పందం కుదుర్చుకుంది. విశాఖపట్నంలో జరుగుతున్న 31వ సీఐఐ భాగస్వామ్య సదస్సు-2026 వేదికగా ఈ మేరకు అవగాహన ఒప్పందం (ఎంవోయూ) కుదిరింది. పారిశ్రామికవేత్తగా, 'నమస్తే వరల్డ్' వ్యవస్థాపకురాలిగా భూమా మౌనిక రెడ్డి ఈ ఒప్పందంపై సంతకం చేశారు. కర్నూలు జిల్లాలోని ఓర్వకల్లు పారిశ్రామిక పార్కులో ఈ పరిశ్రమను ఏర్పాటు చేసే అవకాశం ఉంది. ఈ స్టార్టప్ ద్వారా భారతీయ సంస్కృతి, సంప్రదాయాలను ప్రతిబింబించే పిల్లల ఆటబొమ్మలు, హస్తకళా ఉత్పత్తులను తయారు చేయనున్నారు.

వివరాలు 

దేశీయ కళాకారులను ప్రోత్సహించడం, వారి ఉత్పత్తులకు గుర్తింపు లక్ష్యం

తద్వారా దేశీయ కళాకారులను ప్రోత్సహించడంతో పాటు వారి ఉత్పత్తులకు గుర్తింపు తీసుకురావాలని లక్ష్యంగా పెట్టుకున్నారు.

ఈ సందర్భంగా భూమా మౌనిక రెడ్డి మాట్లాడుతూ.. సీఐఐ భాగస్వామ్య సదస్సు ద్వారా ఎంతోమంది హస్తకళాకారులు, యువ పారిశ్రామికవేత్తలు ఒకే వేదికపైకి రావడం ఆనందంగా ఉందన్నారు.

స్థానిక కళాకారులు, స్టార్టప్‌లు తయారు చేసే ఉత్పత్తులకు అంతర్జాతీయ మార్కెట్‌లో అవకాశాలు కల్పించేందుకు ఈ సదస్సు ఉపయోగపడుతోందని పేర్కొన్నారు.

ఇంతటి ప్రతిష్ఠాత్మక కార్యక్రమాన్ని విజయవంతంగా నిర్వహించిన ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వానికి, నిర్వాహకులకు ఆమె కృతజ్ఞతలు తెలిపారు.

ట్విట్టర్ పోస్ట్ చేయండి

ఓర్వకల్లులో మంచు మనోజ్ దంపతుల కొత్త పరిశ్రమ

ADVERTISEMENT