తదుపరి వార్తా కథనం
Mandha Krishna Madiga: సీఎం రేవంత్‌తో మందకృష్ణ భేటీ.. జస్టిస్ షమీమ్ అక్తర్ నివేదికపై ప్రభుత్వానికి సూచనలు
వ్రాసిన వారు
Sirish Praharaju
Feb 11, 2025
03:09 pm
ఈ వార్తాకథనం ఏంటి
ఎస్సీ రిజర్వేషన్ల వర్గీకరణకు అనుకూలంగా తీర్మానం చేసినందుకు సీఎం రేవంత్ రెడ్డి, ఎమ్మెల్యేలకు కృతజ్ఞతలు తెలియజేస్తున్నామని ఎమ్మార్పీఎస్ వ్యవస్థాపకుడు మందకృష్ణ మాదిగ తెలిపారు.
మంగళవారం సీఎం రేవంత్‌తో జరిగిన భేటీ అనంతరం ఆయన మీడియాతో మాట్లాడారు. జస్టిస్ షమీమ్ అక్తర్ నివేదికపై ప్రభుత్వానికి సూచనలు ఇచ్చినట్లు పేర్కొన్నారు.
"సుప్రీం కోర్టు తీర్పు వచ్చిన వెంటనే ఎస్సీ వర్గీకరణ చేపట్టారు, ఇందులో సీఎం రేవంత్ రెడ్డిగారు భాగస్వామ్యంగా ఉన్నారు. అందుకే వారికి ధన్యవాదాలు తెలిపాం. అయితే, జస్టిస్ షమీమ్ అక్తర్ నివేదికలో కొన్ని లోపాలున్నాయి. ఎస్సీలను 1, 2, 3 గ్రూపులుగా కాకుండా ఏ, బీ, సీ, డీ వర్గాలుగా విభజించాలి. నివేదికలో ఉన్న లోటుపాట్లను సవరిస్తారని ఆశిస్తున్నాం" అని మందకృష్ణ మాదిగ పేర్కొన్నారు.