విదేశీ నిధుల్లో అవకతవకలు; బీబీసీపై కేసు నమోదు చేసిన ఈడీ
ఈ వార్తాకథనం ఏంటి
విదేశీ నిధుల్లో అవకతవకలు జరిగాయంటూ ఎన్‌ఫోర్స్‌మెంట్ డైరెక్టరేట్ బీబీసీ ఇండియాపై ఫారిన్ ఎక్స్ఛేంజ్ మేనేజ్‌మెంట్ యాక్ట్ (ఫెమా) కింద కేసు నమోదు చేసింది.
బీబీసీ ఇండియా ద్వారా విదేశీ నిధుల అవకతవకలు, నిధుల మళ్లింపు, ఫారిన్ ఎక్స్ఛేంజ్ మేనేజ్‌మెంట్ యాక్ట్ 1999 (ఫెమా) కింద నిబంధనల ఉల్లంఘనలపై విచారణ జరిపేందుకు కేసు నమోదు చేసినట్లు అధికారిక వర్గాలు తెలిపాయి.
ఈ ఏడాది ఫిబ్రవరిలో దిల్లీ, ముంబైలోని బీబీసీ కార్యాలయాల్లో ఆదాయపు పన్ను శాఖ సోదాలు నిర్వహించింది. ఆ సమయంలో లభించిన ఆధారాలన నేపథ్యంలో ఈడీ ఇప్పుడు కేసు నమోదు చేసినట్లు తెలుస్తోంది.
ఈడీ
ఫిబ్రవరిలో బీబీసీ ఆఫీసుల్లో ఆదాయపు పన్ను శాఖ సర్వే
వివాదాస్పద డాక్యుమెంటరీ, 'ఇండియా: ది మోదీ క్వశ్చన్'ను జనవరిలో బీబీసీ విడుదల చేసిన నేపథ్యంలో భారత ప్రభుత్వం ఖండించింది.
2002 గుజరాత్ అల్లర్లలో ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ పాత్రను ప్రశ్నిస్తూ బీబీసీ ఈ డాక్యుమెంటరీని రూపొందించింది.
బీబీసీ డాక్యుమెంటరీ అంశం దేశంలోనే కాదు, ప్రపంచ వ్యాప్తంగా ప్రధాన అంశంగా మారింది.
డాక్యుమెంటరీ విడుదల అనంతరం ఫిబ్రవరిలో ఆదాయపు పన్ను శాఖ బీబీసీ ఆఫీసుల్లో సర్వే చేసింది. ఈ అంశంపై గతంలో బీబీసీకి ఈడీ సమన్లు కూడా జారీ చేసింది.