Page Loader
మణిపూర్‌లో మళ్లీ హింసాత్మకం.. మరో 6 రోజుల పాటు ఇంటర్నెట్ నిషేధం 
మరో 6 రోజుల పాటు ఇంటర్నెట్ నిషేధం

మణిపూర్‌లో మళ్లీ హింసాత్మకం.. మరో 6 రోజుల పాటు ఇంటర్నెట్ నిషేధం 

వ్రాసిన వారు TEJAVYAS BESTHA
Oct 12, 2023
12:52 pm

ఈ వార్తాకథనం ఏంటి

మణిపూర్‌లో మరోసారి అలజడులు రేగుతున్నాయి. ఈ మేరకు మొబైల్ ఇంటర్నెట్ సేవలపై నిషేధాన్ని మరో 6 రోజుల పాటు పొడిగించినట్లు రాష్ట్ర ప్రభుత్వం ప్రకటించింది. సెల్ ఫోన్ డేటా ఇంటర్నెట్ సేవలను నిలిపివేయడాన్ని అధికారిక నోటిఫికేషన్ ద్వారా వెల్లడించింది. దీంతో అక్టబర్ 16 వరకు అంతర్జాల సేవలపై ఆంక్షలు విధించినట్టైంది. రెచ్చగొట్టే వీడియోలు, ఫోటోలు,అలజడి రేపే కంటెంట్‌పై బ్యాన్ కొనసాగుతోంది. సోషల్ మీడియా ప్లాట్‌ఫారమ్‌లలో హింసాత్మక కార్యకలాపాలను వైరస్ చేసే వీడియోలు లేదా చిత్రాలను అప్‌లోడ్ చేసే వారి చర్యలను నిరోధించాలని ప్రజలకు సూచించింది. వాట్సాప్,ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్, ఎక్స్‌ లాంటి సామాజిక మాధ్యమాల్లోని హింసాత్మక కంటెంట్‌లపై కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించింది. ముకుమ్మడిదా SMSలతో హింసను ప్రేరేపించేలా ప్రచారం చేయకూడదని స్పష్టం చేసింది.

ట్విట్టర్ పోస్ట్ చేయండి

విష ప్రచారాన్ని నిరోధించేందుకు అక్టోబర్ 16 వరకు ఇంటర్నెట్ బ్యాన్